twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ రివ్యూ: రాంబోగా రాంచరణ్.. ఆ సీన్లే హైలెట్.. బోయపాటి పట్టుదలతో ఆ మ్యాజిక్!

    |

    రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది. క్రేజీ కాంబినేషన్‌తో జనవరి 11న వస్తున్న ఈ చిత్రంపై అందరి దృష్టిపడింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అంశాలు మీ కోసం..

     నలుగురు అన్మదమ్ముల కథ

    నలుగురు అన్మదమ్ముల కథ

    నలుగురు అన్నదమ్ముల కథనే వినయ విధేయ రామ చిత్రం. మాస్, వినోదం అంశాలతో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు ఎలా కలిశారు. వారు ఎలా ఓ ఫ్యామిలీగా మారారు. వారు కలువడం వెనుక ఆసక్తికరమైన ట్విస్ట్ సినిమాకు ఆకర్షణ అని చెబుతున్నారు.

    రాంబో లుక్‌తో రాంచరణ్

    రాంబో లుక్‌తో రాంచరణ్

    రంగస్థలం చిత్రంలో సాదాసీదా గ్రామీణ యువకుడిగా కనిపించిన రాంచరణ్ ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు. యాక్షన్ సీన్ల కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకొన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను పట్టుబట్టి చెర్రీని రాంబోగా మార్చారు. అద్భుతమైన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడానికి రాంచరణ్‌కు భార్య ఉపాసన సహకరించారు. క్రమం తప్పకుండా జిమ్, డైట్ వ్యవహారాలను ఉపాసన పర్యవేక్షించారు. రాంబో లుక్‌తో రామ్ పోస్టర్ సోషల్ మీడియాను కుదిపేసింది.

     అజర్ బైజాన్ సన్నివేశాలు

    అజర్ బైజాన్ సన్నివేశాలు

    వినయ విధేయ రామ చిత్రం కోసం దర్శకుడు బోయపాటి ప్రత్యేకంగా యాక్షన్ సీన్లను డిజైన్ చేశారు. అజర్ బైజాన్లో‌ చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అనే ప్రచారం జరుగుతున్నది. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో ఈ సినిమా కోసం కష్టపడి షూట్ చేయడం జరిగింది. అజర్ బైజాన్ ఎపిసోడ్‌ను బోయపాటి అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తున్నది.

    ఇంటిపేరు.. సొంతపేరుతో మ్యాజిక్

    ఇంటిపేరు.. సొంతపేరుతో మ్యాజిక్

    వినయ విధేయ రామ కోసం బోయపాటి శ్రీను రాసిన కథ, డైలాగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. తొలిసారి తన ఇంటిపేరు, తన పేరు కొణిదెల రామ్ పాత్రలో రాంచరణ్ కనిపిస్తారు. రాంచరణ్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి.

     రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

    రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్

    హీరో రాంచరణ్ బాక్సాఫీస్ స్టామినాకు వినయ విధేయ రామ సాక్ష్యంగా నిలిచింది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. అలాగే నైజాం హక్కులు రూ.18 కోట్లకు, ఏపీ, సీడెడ్ హక్కులు రూ.64 కోట్లకుపైగా అమ్మడం సెన్సేషనల్‌గా మారింది. ఓవరాల్‌గా ఈ సినిమా హక్కులు రూ.90 కోట్లకు అమ్మడం జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

     క్రేజీగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్

    క్రేజీగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్

    ఇక వినయ విధేయ రామ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది. తస్సాదియ్యా పాట క్రేజీగా మారింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బోయపాటి సినిమాకు దేవీ అందించిన రీరికార్డింగ్ ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

     నిర్మాతగా దానయ్య స్టామినా

    నిర్మాతగా దానయ్య స్టామినా

    వినయ విధేయ రామ చిత్రానికి డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూపొందించారు. గతంలో రాంచరణ్‌తో దానయ్య బ్రూస్‌లీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే దానయ్య నిర్మించే RRR చిత్రంలో రాంచరణ్ హీరో కావడం విశేషం. అంతేకాకుండా చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చే చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత కావడం గమనార్హం.

    English summary
    The secnond single, Thassadiyya from Ram Charan & Boyapati Srinu's 'Vinaya Vidheya Rama' will be out tomorrow at 4 pm. This movie is all set to Release in January 2019. Devi Sri Prasad is the music Director. DVV Danaiah as producer, Boyapati Srinu is the director for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X