For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Ram Pothineni: ఏకంగా ఐదు సెంచరీలు.. టాలీవుడ్‌లో ఏకైక హీరోగా రామ్ ఊహించని రికార్డు

  |

  బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ పొతినేని. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకున్న అతడు.. స్టార్ స్టేటస్‌తో పాటు ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇలా దాదాపు పదిహేనేళ్లుగా టాలీవుడ్‌లో తనదైన శైలి మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులను కూడా అందుకున్నాడు. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతం అయిన అతడు.. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి కెరీర్ విశేషాలు మీకోసం!

  Ram Pothineni : 15 ఏళ్ల ప్రస్థానం.. Cult Fan Base | Happy Birthday RAPO || Filmibeat Telugu
  తమిళంలో మొదలు... తర్వాతే తెలుగు

  తమిళంలో మొదలు... తర్వాతే తెలుగు


  ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోర్ సోదరుడి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. అయితే, ముందుగా అంటే టీనేజ్‌లోనే తమిళంలో ‘అడయాలమ్' అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. దానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డులు సైతం అందుకున్నాడు. ఆ తర్వాతనే ‘దేవదాసు' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఇది సూపర్ హిట్ అయింది.

   ఆరంభంలోనే అదుర్స్ అనిపించిన రామ్

  ఆరంభంలోనే అదుర్స్ అనిపించిన రామ్

  ‘దేవదాసు'తో తన ఎంట్రీని గ్రాండ్‌గా చూపించాడు రామ్. దీని తర్వాత వచ్చిన ‘జగడం' ఫ్లాప్ అయిన ఆ తర్వాత చేసిన ‘రెడీ'తో భారీ హిట్‌ను దక్కించుకున్నాడు. ఆ వెంటనే ‘మస్కా', ‘కందిరీగ' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకుని ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టర్‌గా సత్తా చాటిన అతడు.. బెస్ట్ డ్యాన్సర్‌గానూ పేరు తెచ్చుకుని దూసుకుపోతున్నాడు.

   వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు

  వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు

  ఇప్పటి వరకు రామ్ పోతినేని చేసిన సినిమాల్లో చాలా వరకూ పరాజయాలు ఉన్నాయి. కెరీర్ ఆరంభంలోనే వచ్చిన ‘జగడం' మొదలుకొని.. ‘రామరామ కృష్ణకృష్ణ', ‘ఎందుకంటే ప్రేమంట', ‘ఒంగోలు గిత్త', ‘మసాలా', ‘శివమ్' తదితర చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇక, ‘హైపర్', ‘ఉన్నది ఒకటే జిందగీ' ఏవరేజ్‌గా నిలిచాయి. వీటి మధ్యలో ‘నేను శైలజ', ‘పండగ చేస్కో' వంటి హిట్లూ వచ్చాయి.

  కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.. ఫుల్ ‌ఫామ్‌లోకి

  కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.. ఫుల్ ‌ఫామ్‌లోకి

  వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న రామ్‌కు సరైన బ్రేక్ రావాలని ఫ్యాన్స్ ఆశించారు. అలాంటి సమయంలోనే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసి రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత అతడు ‘రెడ్' అనే సినిమాతో మరో హిట్‌ను అందుకున్నాడు.

   అందులో యమ యాక్టివ్... భారీ క్రేజ్‌తో

  అందులో యమ యాక్టివ్... భారీ క్రేజ్‌తో

  రామ్ పోతినేని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తన పర్సనల్, ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు సైతం వదులుతున్నాడు. అలాగే, మూవీ అప్‌డేట్స్ కూడా ఇస్తాడు. ఇలా ఫాలోవర్లను పెంచుకుంటున్నాడు.

  ఏకంగా ఐదు సెంచరీలు చేసిన హీరోగా

  ఏకంగా ఐదు సెంచరీలు చేసిన హీరోగా

  రామ్ సినిమాలకు తెలుగులోనే హిందీలోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే అతడు నటించిన ఐదు సినిమాలు ఏకంగా వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. ‘హలో గురూ ప్రేమ కోసమే' హిందీ డబ్బింగ్‌కు 318 మిలియన్లు, ‘నేను శైలజ'కు 348 మిలియన్లు, ‘ఉన్నది ఒకటి జిందగీ'కి 207 మిలియన్లు, ‘హైపర్'కు 138 మిలియన్లు, ‘ఇసార్ట్ శంకర్'కు 195 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

   కోలీవుడ్ డైరెక్టర్‌తో ద్విభాషా చిత్రంతో

  కోలీవుడ్ డైరెక్టర్‌తో ద్విభాషా చిత్రంతో

  వరుస విజయాలతో దూసుకుపోతోన్న రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇక, దీనితో పాటు రామ్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఎనర్జిటిక్ స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు.

  English summary
  Ram Pothineni is on of the Star Hero in Telugu Film Industry. His Five Movie Reach 100 Million Views in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X