For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RC15: రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ హీరో.. సౌతిండియా నుంచి మరో సీనియర్ స్టార్

  |

  పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. బడా హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే దిగ్గజ దర్శకుడు శంకర్‌తో ఓ భారీ ప్రాజెక్టును చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్, కోలీవుడ్ హీరోలు వస్తున్నారని తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

   విడుదలకు సిద్ధంగా రెండు సినిమాలు

  విడుదలకు సిద్ధంగా రెండు సినిమాలు

  ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య'లోనూ సిద్ధ అనే నక్సలైట్ పాత్రను చేస్తున్నాడు.

  కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు
  https://telugu.filmibeat.com/television/roja-shocking-comments-on-personal-problem-in-oorilo-vinayakudu-event-102433.html

  దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా

  దిగ్గజ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా

  ప్రస్తుతం చేతిలో ఉన్న RRR, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది.

  శంకర్ ఫోకస్ మొత్తం దీనిపైనే ఉందిగా

  శంకర్ ఫోకస్ మొత్తం దీనిపైనే ఉందిగా

  డైరెక్టర్ శంకర్‌.. చాలా ఏళ్ల క్రితమే కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2' అనే ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, కొన్ని వివాదాల కారణంగా అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో నిర్మాణ సంస్థతో ఆయనకు విభేదాలు రావడంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. కానీ, ఇటీవలే దీనికి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో శంకర్.. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  అవన్నీ కంప్లీట్.. ఇప్పుడు అదే పనిలో

  అవన్నీ కంప్లీట్.. ఇప్పుడు అదే పనిలో

  శంకర్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శంకర్ మొదలు పెట్టి.. దాదాపుగా వాటిని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్‌ మీద దృష్టి సారించారని తెలుస్తోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని సెలెక్ట్ చేశారు. అలాగే మరికొందరినీ ఫైనల్ చేశారని తెలుస్తోంది.

  ముహూర్తం ఫిక్స్.. భారీ స్థాయిలో ప్లాన్

  ముహూర్తం ఫిక్స్.. భారీ స్థాయిలో ప్లాన్

  ఇండియాలోనే దిగ్గజ దర్శకుడు శంకర్ - టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 8న చిత్ర నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో గ్రాండ్‌ను చేయబోతున్నారట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇక, అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుక కోసం భారీ ప్లాన్స్ వేశారట.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  చరణ్ సినిమా కోసం ఇద్దరు స్టార్టు రాక

  చరణ్ సినిమా కోసం ఇద్దరు స్టార్టు రాక

  సెప్టెంబర్ 8న జరగనున్న రామ్ చరణ్ - శంకర్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, కోలీవుడ్ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ రాబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రెండు రోజుల్లో రానుందని టాక్.

  Director Maruthi Launched 'Achamaina Telugu Inti Pillave' Song From Savitri w/o Satyamurthy
  మన వాళ్లు కూడా భారీగానే వస్తారట

  మన వాళ్లు కూడా భారీగానే వస్తారట

  పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో రామ్ చరణ్, శంకర్ సినిమా ప్రారంభోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించి అందరి దృష్టినీ ఆకర్షించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలతో పాటు టాలీవుడ్‌లోని పలువురు స్టార్లను కూడా దీనికి తీసుకు రాబోతున్నారని తెలుస్తోంది. చరణ్‌, దిల్ రాజుతో సన్నిహిత సంబంధాలున్న హీరోలు దీనికి వస్తారనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Mega Power Star Ram Charan Now Doing RRR Under Rajamouli Direction. After This he will do a film with S. Shankar. Ranveer Singh and Vikram will Attend for This Movie Opening Ceremony.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X