Just In
- 7 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 8 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 9 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 10 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పంది మాంసం తింటాను.. రోజూ రాత్రి రెండు పెగ్గులు.. రష్మిక కామెంట్స్ వైరల్
రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. రష్మిక షేర్ చేసే క్యూట్ ఫోటోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. గత రెండు మూడు రోజులుగా రష్మిక వార్తల్లో వైరల్ అవుతోంది. తన ఆచార వ్యవహారాలు, ఆహార పద్దతుల గురించి రష్మిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఉపాసన నిర్వహించే ఈప్రోగ్రాంలో రష్మిక చెప్పిన మాటలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

ఉపాసన స్పెషల్ షో..
మెగా కోడలు ఉపాసన URLife పేరిట ఓ స్పెషల్ వెబ్ సైట్, మ్యాగజైన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాలతో కూడిన వంటకాలను ఎలా వండాలో చెబుతూ ఉంటుంది. ఇందులో భాగంగా సెలెబ్రిటీలను చీఫ్ గెస్ట్‌గా పిలుస్తుంటుంది.

నాడు సమంత..
అప్పట్లో సమంత ఉపాసన కలిసి ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. మెగా అక్కినేని కోడల్లు వంట సామ్రాజ్యాన్ని ఏలేశారు. సమంత స్పెషల్ ఇడ్లీలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా రష్మిక ఈ షోలో పాల్గొంది. రష్మిక స్పెషల్ వంటకం వండింది. దానిలో భాగంగా అనేక విషయాలను బయటకు వచ్చాయి.

ఉపాసన ప్రశ్న..
ఆ షోలో రష్మిక వండిన వంటకం పేరు ‘కోలీ పుట్టు' కూర. కోడిని కోర్గిలో కోలి అంటారని రష్మిక అనగానే.. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? మీరు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా? అని ఉపాసన అడిగేసింది. దీనికి రష్మిక స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

పంది కూరను..
ఉపాసన ప్రశ్నకు రష్మిక రియాక్ట్ అవుతూ.. అవును, పంది మాంసం మా సంప్రదాయ వంటకమని చెప్పేసింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేస్తామని, ప్రతి కోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా రెండు పెగ్‌ల వైన్ తాగుతారని సీక్రెట్లను బయట పెట్టేసింది.

సినిమాలతో బిజీగా..
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ ఆడాళ్లూ మీకు జోహార్లు అనే చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాకు రష్మిక భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రష్మిక డిమాండ్ మాత్రం గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.