Just In
- 37 min ago
హైపర్ ఆదిపై దారుణమైన కామెంట్స్.. అలా అంటూ పరువుదీసిన నాగబాబు
- 8 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 9 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 9 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
Don't Miss!
- Sports
KKR vs MI: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్.. 12 బంతుల్లోనే!!
- Lifestyle
బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు...!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జున్ను బర్త్ డే.. లాస్య గ్రాండ్ పార్టీ.. భార్యతో కలిసి యాంకర్ రవి హల్చల్
బుల్లితెరపై యాంకర్ రవి లాస్య సృష్టించిన సంచలనం, ఇప్పుడు క్రియేట్ చేస్తోన్న మ్యాజిక్ గురించి అందరికీ తెలిసిందే. గత ఐదేళ్లుగా దూరంగా ఉంటూ వచ్చిన ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసి పోయారు. ఇరు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటున్నాయి. ఇద్దరూ కలిసి స్పెషల్ ఈవెంట్లు కూడా చేసేస్తున్నారు. అయితే తాజాగా లాస్య తన కుమారుడు జున్ను బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది.
వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

జున్ను గాడు అంటూ..
బిగ్ బాస్ ఇంట్లో లాస్య ఉన్నంత కాలం జున్ను అనే మార్మోగిపోయింది. తన కొడుకును లాస్య తలుచుకోని రోజంటూ లేదు. చివరకు ఓ రోజు జున్ను మాట్లాడిన మాటలను కూడా బిగ్ బాస్ ప్లే చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్‌ను బిగ్ బాస్ తన ఇంట్లోకి ఆహ్వానించిన సమయంలో జున్ను కూడా తన అమ్మను చూసేందుకు వచ్చాడు.

నాగార్జున అలా..
ఫ్యామిలీ మెంబర్స్ ఎపిసోడ్‌లో భాగంగా జున్ను ఇంట్లోకి వచ్చినప్పుడు లాస్యను అంతగా పట్టించుకోలేదు. తన కారుతో ఆడుకుంటూ ఉండిపోయాడు. లాస్య ఎంతగా ఎమోషనల్ అయినా కూడా జున్ను మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఇదే విషయంపై నాగార్జున కూడా కౌంటర్ వేశాడు.

జున్నుతో స్పెషల్ వీడియో..
బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన లాస్య తన యూట్యూబ్ చానెల్‌ను బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, భర్త, పిల్లాడితో కలిసి చేసిన సరదా వీడియోలను కూడా షేర్ చేస్తూ వస్తోంది. అలా జున్నుతో చేసిన అల్లరి బాగానే వైరల్ అవుతుంటుంది.

తాజాగా అలా..
అయితే నిన్న జున్ను బర్త్ డే సందర్బంగా లాస్య గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టుంది. ఇందులో కామెడీ స్టార్స్ సభ్యులందరూ పాల్గొన్నట్టు కనిపిస్తోంది. ఇందులో రవి తన భార్యతో కలిసి హల్చల్ చేసినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే ఇప్పుడు లాస్య, రవి ఇద్దరూకూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు.

ఉగాది ఈవెంట్..
ప్రస్తుతం లాస్య, రవి కలిసి ఉగాది ఈవెంట్‌ను కూడా హోస్ట్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రవి చేసిన పోస్ట్‌లు, షేర్ చేసిన ఫోటోలు వైరల్అవుతున్నాయి. ఇప్పటికే స్టార్ మాలో ఉగాది పండుగ కోసం కార్తీకదీపం టీంతో రామాయణ గాథను వివరించే ప్రోమో బాగానే వైరల్ అయింది.