Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
MS Dhoniతో బ్రేకప్ ఎందుకైందంటే? నా జీవితంపై చెరిగిపోని మచ్చ అంటూ రాయ్ లక్ష్మి
దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు హిందీ సినీ రంగంలో తన ప్రతిభను చాటుకొంటున్న రాయ్ లక్ష్మీ అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు మీడియాలో హాట్ టాపిక్స్‌గా మారడం తెలిసిందే. అయితే తన జీవితంలో పలుమార్లు బ్రేకప్స్ జరిగినా లైఫ్‌ను తేలికగా తీసుకొంటూ ప్రొఫెషనల్ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే అడపదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఆమె తాజాగా తన జీవితంలో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనితో ప్రేమ వ్యవహారం వైఫల్యం గురించి తాజా ఇంటర్యూలో పంచుకొన్నారు. వారిద్దరి మధ్య ఎందుకు బ్రేకప్ జరిగిందంటే..

ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా
తమిళ చిత్ర రంగంలో స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకొన్న రాయ్ లక్ష్మీ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ధోని ఉన్న సమయంలో డేటింగ్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల అనంతరం జరిగే పార్టీలకు ధోనితో కలిసి రాయ్ లక్ష్మీ హాజరయ్యారు. అయితే 2008 నుంచి 2009 వరకు వారి అఫైర్ ఘాటుగా సాగింది.

ఎంఎస్ ధోనితో రాయ్ లక్ష్మీ డేటింగ్
రాయ్ లక్ష్మీతో ఎంఎస్ ధోని డేటింగ్ వ్యవహారం అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం తెలిసిందే. వారిద్దరి రిలేషన్ గురించి అనేక కథనాలు వెలువడ్డాయి. వారి రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుందనే విషయాన్ని కూడా ఓ వర్గం మీడియా వెల్లడించింది. అయితే ఊహించని విధంగా ధోని, రాయ్ లక్ష్మీ అఫైర్ ఏడాదిలోపే బ్రేక్ అయింది.

ధోనితో బ్రేకప్ తర్వాత ఒంటరిగానే
రాయ్ లక్ష్మీతో బ్రేకప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని పెళ్లి సాక్షితో జరిగింది. ప్రస్తుతం వారికి ఏడేళ్ల కూతురు జీవా ఉన్నారు. అయితే రాయ్ లక్ష్మీ మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే ధోనితో బ్రేకప్ గురించి రాయల్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఆయనతో నా రిలేషన్ నా జీవితంపై ఓ మచ్చగా మారింది. ఇంకా ధోనితో బ్రేకప్ వ్యవహారంపై మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది అని రాయ్ లక్ష్మీ చెప్పారు.

12 ఏళ్లు గడిచినా ఇంకా వెంటాడుతూనే..
ఎంఎస్ ధోనితో బ్రేకప్ జరిగి దాదాపు 12 ఏళ్ల గడిచిపోయినా ఆ విషయం నన్ను వెంటాడుతూనే ఉంది. ధోని గురించి మీడియాలో ఏదైనా విషయం చర్చ జరిగినప్పుడు రాయ్ లక్ష్మీతో అఫైర్ గురించి మాట్లాడుతారు. నాకు పిల్లలు కలిగి వారు పెద్దైన తర్వాత కూడా ధోనితో అఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమో అని రాయ్ లక్ష్మీ చెప్పారు.
Recommended Video

ఎందుకు విడిపోయామంటే?
ఏడాదిపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత ధోని, నేను సామరస్యంగా విడిపోవాలని అనుకొన్నాం. ఎలాంటి గొడవలు లేకుండా మంచిగానే మా అఫైర్‌కు బ్రేకప్ చెప్పుకొన్నాం. మా బ్రేకప్ ఆయనకు మంచే జరిగింది. ఆయనతో రిలేషన్‌షిప్ వర్కవుట్ కాకపోవడంపై ఎలాంటి బాధలేదు. బ్రేకప్ జరిగినా మాలో ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉంది. బ్రేకప్ తర్వాత ముందుకెళ్లి పెళ్లి చేసుకొన్నారు. అప్పడే ఆ కథ ముగిసిపోయిందని అనుకొన్నాను. ధోని తర్వాత నా జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయి. అయినా నేను ఎప్పుడూ బాధపడలేదు. హ్యాపీగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాను అని రాయ్ లక్ష్మీ తెలిపారు.