Just In
- 8 min ago
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్, చెర్రీ సందడి
- 36 min ago
చాలా కాలం తరువాత పవన్‌తో త్రివిక్రమ్.. చాయ్ గ్లాసుతోనే మొదలు పెట్టారు
- 42 min ago
ఆ ఒక్క మాటతో ఎంతో బాధ.. ఎస్పీబీపై చిరంజీవి ఎమోషనల్
- 2 hrs ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
Don't Miss!
- News
సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం .. నేరస్థులు సీఎం అయితే కోర్టులనే బెదిరిస్తారని ఆగ్రహం
- Sports
రిషభ్ పంత్ ప్రమోషన్ వ్యూహం నాది కాదు.. ఆ ఘనత పూర్తిగా విరాట్ కోహ్లీదే: విక్రమ్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘనంగా సింగర్ సునీత పెళ్లి: ఇండస్ట్రీ నుంచి హాజరైంది వీళ్లే.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ ఇద్దరు!
దాదాపు రెండు దశాబ్దాలుగా తన గాత్రంతో అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సింగర్ సునీత. టీనేజ్‌లోనే ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు. అదే సమయంలో చాలా మంది నటీమణులకు డబ్బింగ్ కూడా చెప్పారు. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయినా.. వైవాహిక జీవితాన్ని మాత్రం సరిగా నడపలేకపోయారామె. ఈ నేపథ్యంలో తాజాగా సునీత రెండో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

భర్తతో విడాకులు.... ఇద్దరు పిల్లలతో కలిసి
19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆ తర్వాత మనస్ఫర్థల కారణంతో ఈ జంట న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సినిమాల్లో పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెబుతూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు.

రహస్యంగా నిశ్చితార్థం.. ఆయన బ్యాగ్రౌండ్
సునీత రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూ ఉండేవి. కానీ వాటిని ఆమె పలుమార్లు కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలోనే ఈ టాప్ సింగర్ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గాయని సునీత వివాహం సెట్ అయింది. కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగినప్పటికీ.. అది లీక్ అయింది.

ప్రీ వెడ్డింగ్ పార్టీ.. మెహందీ ఈవెంట్ కూడా
నిశ్చితార్థం తర్వాత ఓ ముహూర్తం అనుకున్నప్పటికీ.. అది జాతక ప్రభావంతో క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత దీన్ని జనవరి 9కి ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి సునీత పెళ్లి పనులతో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే ఇటీవల గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో వీళ్ల ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

ఘనంగా సింగర్ సునీత - రామ్ వివాహం
అనుకున్న ముహూర్తానికే అంటే జనవరి 9 శనివారం సాయంత్రం మీడియా దిగ్గజం రామ్ వీరపనేనితో సింగర్ సునీత రెండో పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు.

ఇండస్ట్రీ నుంచి వచ్చింది వీళ్లే.. పెళ్లికి మాత్రం
సునీత సినీ ఇండస్ట్రీలోని చాలా మందితో క్లోజ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కరోనా ప్రభావం కారణంగా వివాహానికి పెద్దగా ఎవరినీ ఆహ్వానించలేదు. కానీ, అత్యంత సన్నిహితులైన కొందరు మాత్రమే దీనికి విచ్చేశారని తెలిసింది. యాంకర్ ఝాన్సీ, సుమ తదితరులు ముందుగానే సందడి చేయగా, రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా విసెష్ చెప్పారు.

స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆ ఇద్దరు
43 ఏళ్ల సునీతకు ఇప్పటికే ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వాళ్లిద్దరూ ఇద్దరూ చదువు పూర్తి చేసి, వృత్తిలో నిలదొక్కుకునే పనిలో బిజీ అయ్యారు. వీళ్లే తమ తల్లి పెళ్లిని దగ్గరుండి మరీ జరిపారు. నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకూ అన్ని పనులూ చూసుకుంటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీంతో తల్లికి తోడును అందించిన వీళ్లిద్దరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.