For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలసుబ్రహ్మణ్యం లవ్ స్టొరీతో ఒక సినిమానే తీయవచ్చు.. ఆ ట్విస్ట్ ఎవరు ఊహించి ఉండరు

  |

  గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎస్పీబీని కడసారి చూసేందుకు వచ్చిన నటుడు అర్జున్... ఆయన పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. 'బాలన్నా... నా సినిమాలకు ఎన్నో దేశభక్తి గీతాలు అందించావు.. ఇప్పుడు నాకోసం ఒక్కసారి లేచి పాట పాడవా..' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అత్యంత ఉద్విగ్న వాతావరణంలో జరిగిన బాలు అంత్యక్రియల్లో చెమ్మగిల్లని కళ్లు లేవు.

   మొదటి చూపులోనే ప్రేమ

  మొదటి చూపులోనే ప్రేమ

  ఎస్పీబి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి అనే అమ్మాయిని చూసిన మొదటి పరుచయంలోనే బాలు ఒక సరికొత్త ప్రేమికుడిగా మారాడు. ఆ యవ్వన వయసులో ఆయన మధురమైన ప్రేమ లేఖలను కూడా అందుకున్నాడు. గాయకుడిగా బిజీ అయిన సమయంలో ఆయన పూర్తిగా మద్రాస్ కి పరిమితం కావాల్సి వచ్చింది.

  ఇంటి యజమాను కూతురితో ప్రేమాయణం

  ఇంటి యజమాను కూతురితో ప్రేమాయణం

  యవ్వన వయసులో బాలసుబ్రహ్మణ్యం నూనూగు మీసాలతో క్యూట్ బాయ్ గా మెరిసిపోయేవారు. ఇక మద్రాస్ లో ఆగస్తేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉన్న బాలు ఒక అమ్మాయిని చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. ఆమె మరెవరో కాదు ఇంటి యజమాని ఆగస్తేశ్వరరావు కూతురు సావిత్రి. కొన్నాళ్ళు దూరంగా చూపులతోనే వారి మనసులు కలిశాయి. ఇష్టం పెరగడంతో ప్రేమ లేఖలు వరకు వెళ్లింది. ఇక ఆ తరువాత ప్రేమ గీతలు కూడా మొదలయ్యాయి.

  అందరూ ఒప్పుకున్నారు.. కానీ ఊహించని ట్విస్ట్

  అందరూ ఒప్పుకున్నారు.. కానీ ఊహించని ట్విస్ట్

  ఇక ఫైనల్ గా సావిత్రి ఇంట్లో ప్రేమ విషయం తెలియడంతో కొంత అయిష్టంగానే వారి భావనను వ్యక్తం చేశారు. ఇక ఎలాగోలా ఒప్పించాలని ఇరు వర్గాల కుటుంబ సభ్యులు చర్చలు జరపగా కులాలు, గోత్రాలు తెరపైకి వచ్చాయి. అయితే గోత్రాలు ఒకటవ్వడంతో కథలో ట్విస్ట్ మొదలైంది. వరుసలు కలవవని అన్న చెల్లెల్లు అవుతారనే కారణం చేత పెళ్లికి అడ్డుకట్ట వేశారు.

  ఇద్దరిని విడదీసినా ప్రేమ తగ్గలేదు

  ఇద్దరిని విడదీసినా ప్రేమ తగ్గలేదు

  ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఇల్లు ఖాళీ చేయించారు. మరోవైపు సావిత్రిని కూడా బెంగుళూరులోని బంధువుల ఇంటికి పంపించేశారు. ఇలా ఇద్దరి మధ్య ఆచారాలు చాలా దూరాన్ని పెంచాయి. అయినప్పటికీ కూడా వారి మనసులో ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. దూరం పెరిగిన కొద్దీ ప్రేమ మరింత దగ్గరవుతుందనే ఫార్ములానే అక్కడ వర్కౌట్ అయ్యింది.

  #SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
  మిత్రుల సహాయంతో ప్రేమ పెళ్లి..

  మిత్రుల సహాయంతో ప్రేమ పెళ్లి..

  ఇక బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుతూ బిజీగా ఉన్నప్పటికీ ఏదో కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం మిత్రులకు నచ్చలేదు. వెంటనే అతన్ని సావిత్రిని కలపాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం సింహాచలం అప్పన్న సన్నిధిలో ఇద్దరికి పెళ్లి చేసేశారు. ఆ తరువాత పెద్దలు కూడా ఏమి అనలేక ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ప్రేమ కథ కొనసాగింది. ఇక వారికి చరణ్, పల్లవిలు అనే ఇద్దరు పిల్లలున్న విషయం తెలిసిందే. వారు కూడా సినిమాల్లో కూడా కొన్ని పాటలు పాడి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

  English summary
  Dairy brand Amul paid tribute to legendary singer SP Balasubrahmanyam in a post on social media on Friday night. SP Balasubrahmanyam died after a long battle with Covid-19 in Chennai on September 25. He was 74. The singer was critical and on maximum life support on Thursday night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X