Happy Birthday Goutham: ఫ్యూచర్ హీరోతో మహేష్ బాబు స్పెషల్ మూమెంట్స్.. ఫొటోస్, వీడియోస్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న మహేష్ బాబు ఇంట్లో మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పవచ్చు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలి టైమ్ మిస్సవ్వడం మహేష్ కి కొంచెం కూడా ఇష్టం ఉండదు. ఇక పుట్టినరోజు వేడుకలు వస్తే ఆ సెలబ్రేషన్స్ మరో లెవెల్లో ఉంటాయి. ఇక నేడు గౌతమ్ 14వ పుట్టినరోజు సందర్భంగా ఘట్టమనేని ఫ్యామిలీలో సరికొత్త సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఆ బెస్ట్ మూమెంట్స్ పై ఒక లుక్కేస్తే..

నమ్రత ద్వారా ఆ స్పెషల్ ఫొటోస్
లాక్ డౌన్ ఉండడంతో ఈ సారి మహేష్ బాబు తన ఫ్యామిలీ మరింత ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాడు. భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఎప్పటికప్పుడు ఫ్యామిలీ సంబంధించిన పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకునేవారు. అందులో ఎక్కువగా మహేష్, గౌతమ్ లకి సంబంధించిన స్పెషల్ ఫోటోస్ ఎక్కువగా వైరల్ అయ్యాయి.

లాక్ డౌన్ లో స్పెషల్ మూమెంట్స్..
లాక్ డౌన్ లో మహేష్ గౌతమ్ ల మధ్య కొన్ని పోటీలు కూడా నడిచాయి. కొన్నిసార్లు ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఎవరు ముందు నవ్వుతారో అనే పోటీ పెట్టుకొని అందరిని నవ్వించారు. అందులో ఎక్కువగా మహేష్ డామినేట్ చేశాడని అర్ధమవుతోంది. అందుకు సంబంధించిన విడియో కూడా అప్పట్లో బాగానే వైరల్ అయ్యింది.
కోడుకుతో వీడియో గేమ్స్
ఇక ఈ తండ్రి కొడుకులు ఆ మధ్య కలిసి ఆడిన వీడియో గేమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టెన్నిస్ ని కూడా ఎక్కువగా ఇష్టపడే మహేష్, గౌతమ్ తో కలిసి పోటాపోటీగా జొయ్ స్టిక్స్ పట్టుకొని టెన్నిస్ ఆడాడు. వీరిద్దరి ఆటలపై నమ్రత ఫోకస్ పెడుతూ ఆ వీడియోలను ఫ్యాన్స్ కి చేరేలా చేస్తోంది.

పిల్లలతో రెగ్యులర్ గా స్విమ్మింగ్
మహేష్ తన ఇద్దరి పిల్లలతో కూడా స్విమ్ చేయడంలో ముందుంటాడు. లాక్ డౌన్ లో ప్రతిరోజూ స్విమ్మింగ్ పూల్ లో గంట సేపటి వరకు స్విమ్ చేయాల్సిందే. ఆ ఫొటోలు కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అవ్వడమే కాకుండా ఇతర సెలబ్రెటీలను కూడా ఆకర్షించాయి. ఇక నేడు గౌతమ్ 14వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆ స్పెషల్ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











