Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్‌సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
శివ పాటకు నాగార్జున డ్యాన్స్.. రెచ్చగొట్టిన ఎన్టీఆర్, ప్రభాస్.. (వీడియో)
బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తీకేయ వివాహం గతవారం మీడియాలో ప్రధాన అంశంగా మారిన విషయం తెలిసిందే. పెళ్లి తంతు పూర్తయిన మ్యారేజ్‌కు సంబంధించిన విషయాలు మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కార్తీకేయ మ్యారేజ్‌కు ముందు జరిగిన సంగీత్‌లో నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్ చేసిన సందడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దానిపై మీరు ఓ లుక్కేయండి..

నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్
ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్, కార్తీకేయ వివాహం డిసెంబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందే రెండు రోజుల క్రితమే సినీ ప్రముఖులు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకొన్నారు. పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన సంగీత్‌లో నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్ హల్‌చల్ చేశారు.

శివ సినిమాలోని బాటనీ పాఠానికి
సంగీత్‌లో అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రంలోని బాటనీ పాఠం ముంది.. మ్యాటనీ ఆట ఉంది. దేనికో ఓటు చెప్పరా పాటను ప్లే చేశారు. నాగార్జున డ్యాన్స్ చేస్తుండగా ప్రభాస్, ఎన్టీఆర్ జతకలిశారు. మధ్య మధ్యలో నాగార్జునకు ప్రభాస్, ఎన్టీఆర్ హుషారు తెప్పించేలా చేశారు.
మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..
నాగ్‌కు కిక్కెంచేలా ఎన్టీఆర్, ప్రభాస్
నాగార్జునకు కిక్ వచ్చేలా ఎన్టీఆర్ అమ్మాయిలా సైగలు చేస్తూ హావభావాలు ప్రదర్శించారు. ఆ పాటకు ఇదేనా డ్యాన్స్ అంటూ ప్రభాస్ సైగ చేశారు. ఆ తర్వాత నాగ్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేశారు. దాంతో గెస్టుల కూడా ఊగిపోయారు.
అన్యోన్యయంగా ప్రభాస్, అనుష్క శెట్టి
ఇక పెళ్లిలో ప్రభాస్, అనుష్క శెట్టి అన్యోన్యయంగా కలిసి తిరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొద్దికాలంగా వస్తున్న అఫైర్ గాసిప్స్‌కు బలం కలిగించేలా వారిద్దరూ కనిపించారు. ప్రభాస్, అనుష్కకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.