twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR స్టోరీ లీక్.. కథ ఇదేనంటూ వైరల్.. రూమర్లపై బాలీవుడ్ హీరో ఖండన

    |

    బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. బాహుబలి లాంటి ప్రపంచ ప్రజాదరణ పొందిన చిత్రం తర్వాత ఎలాంటి సినిమాను రూపొందిస్తారని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు క్రేజీ వార్తను అందించాడు. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా భారీ బడ్జెట్‌తో మల్టీస్టారర్ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ ఏమిటని ఆసక్తిరేపుతున్న సమయంలో మీడియాలో ఓ కథనం వైరల్‌గా మారింది. RRR సినిమా కథేంటంటే..

    ఎస్ఎస్ రాజమౌళి చెప్పిందేమింటంటే

    ఎస్ఎస్ రాజమౌళి చెప్పిందేమింటంటే

    ఇటీవల హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. RRR సినిమా జాతీయ ప్రాజెక్ట్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే కథ ఉంటుంది. ఓవర్సీస్, ఇతర భాషల ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. బాహుబలి మాదిరిగానే మ్యాజిక్ చేస్తుంది అని అన్నారు.

    1900 కాలపు పరిస్థితులతో

    1900 కాలపు పరిస్థితులతో

    RRR సినిమా 1900 కాలం నాటి పరిస్థితుల్లో జరిగే కథ. ఈ చిత్రంలో రాంచరణ్ బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఆఫీసర్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కె ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య జరిగే యాక్షన్ డ్రామా థ్రిల్లింగ్‌గా ఉంటుంది అనేది సినీ వర్గాల కథనం.

     రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ పార్ట్

    రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ పార్ట్

    RRR చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లను రామోజీ ఫిలిం సిటీలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌కు సమీపంలోని అల్యుమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం ఇక్కడే చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు.

     బ్రిటీష్ పాలనలోని పోలీస్ స్టేషన్ సెట్

    బ్రిటీష్ పాలనలోని పోలీస్ స్టేషన్ సెట్

    అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా పోలీస్ స్టేషన్ సెట్‌ను కూడా రూపొందించారు. పోలీస్ స్టేషన్ సెట్‌లో రాంచరణ్‌పై కొన్ని సీన్లను ఇటీవల చిత్రీకరించారు. ఇదిలా ఉండగా, షూటింగ్‌కు అనువుగా ఉండేందుకు చిత్ర యూనిట్ సభ్యుల కోసం, ఎడిటింగ్, ఇతర డిపార్ట్‌మెంట్ల కోసం ఇంటి సెట్‌ను కూడా వేయడం గమనార్హం.

    హీరో అజయ్ దేవగన్ రియాక్షన్

    హీరో అజయ్ దేవగన్ రియాక్షన్

    RRR చిత్రానికి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అందులో భాగంగానే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నట్టు కొన్ని కథనాలు మీడియాలో కనిపించాయి. వాటిపై అజయ్ దేవగన్ స్పందిస్తూ విలన్‌గా నటిస్తున్నట్టు వార్త నా దృష్టికి వచ్చింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు.

     RRR మూవీలో నటించడం లేదు

    RRR మూవీలో నటించడం లేదు

    RRR సినిమాలో నటించాలని రాజమౌళి గానీ, సినిమా యూనిట్ సభ్యులు గానీ నన్ను సంప్రదించలేదు. ఆ సినిమాలో నేను నటించడం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే నేను అందుకు సిద్ధం. అలాంటిదే జరిగితే నేను అధికారికంగా వెల్లడిస్తాను అని అజయ్ దేవగణ్ చెప్పాడు.

    English summary
    SS Rajamouli's RRR movie will be 1900 backdrop, which Ram Charan and NTR are the lead. Rajamouli said, "RRR is another pan-Indian film. Like my previous offering Baahubali, even RRR has also the content that makes an appeal to the Indian audiences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X