HBD Superstar Krishna Garu: 50 ఏళ్ల క్రితమే అసలైన పాన్ ఇండియా మూవీ.. ప్రయోగాలకు రారాజు!
సూపర్ స్టార్ కృష్ణగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఘట్టమనేని శివ రామ కృష్ణ ఈ రోజు తన 78 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఈ సిమియర్ నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు 5 దశాబ్దాల సినీ కెరీర్‌లో కృష్ణ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ పై ఒక లుక్కేస్తే..

నిత్యం గుర్తు చేసుకునే పేరు..
350 కి పైగా చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ తనకు మొదటి అవకాశం ఇచ్చిన వారిని ప్రతి సినిమా వేడుకలో గుర్తు చేసుకుంటారు. డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు ద్వారానే తన సినిమా జీవితం మొదలైందని అనేకసార్లు చెప్పుకున్నారు. నటనతో పాటు రైటర్ గా అలాగే, దర్శకుడిగా నిర్మాతగా కూడా కృష్ణ మల్టీ టాలెంటటెడ్ హీరో అనిపించుకున్నారు.

Array
ఇండస్ట్రీలో కృష్ణ చేసిన ప్రయోగాలు అప్పట్లో ఎవరు చేయలేదు. అందుకే ఆయనను 'డేరింగ్ & డాషింగ్' హీరోగా పిలుస్తారు. ప్రయోగాగాలు చేయడంలో ఆయన ఎప్పుడైనా సరే ముందుంటారు. చిత్రనిర్మాణంలో కూడా కృష్ణ ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఫాలో అవుతుండేవారు. తద్వారా ఇండస్ట్రీలో టెక్నీకల్ గా కూడా చాలా మార్పులు వచ్చాయి.

'పద్మ భూషణ్' పురస్కారం
సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్, ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్, ఫస్ట్ 70 ఎమ్ఎమ్ ఫిల్మ్, ఫస్ట్ డిటిఎస్ ఫిల్మ్, ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్, ఫస్ట్ స్పై ఫిల్మ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించాయి. అందుకే భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను కృష్ణకు 2009 లో 'పద్మ భూషణ్' పురస్కారంతో గౌరవం దక్కింది.

అప్పట్లోనే పాన్ ఇండియా సినిమా..
మొదటి కౌ బాయ్ సినిమా - మోసగాళ్లకు మొసగాడు (1971) అప్పట్లో పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా విడలయ్యింది. మొదటి సినిమాస్కోప్ చిత్రం - అల్లూరి సీతారామ రాజు (1974), మొదటి ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్ - ఈనాడు (1982), మొదటి 70 ఎంఎం - సింహాసనం (1986), మొదటి డిటిఎస్ ఫిల్మ్ - తెలుగు వీర లేవరా (1995) మొదటి స్పై ఫిల్మ్ - గూడాచారి 116 (1966). ఇలా అన్నిట్లోనూ ఆయన ఫస్ట్ ఉన్నారు.
Recommended Video

ఆ సినిమా తరువాత మళ్ళీ నటించలేదు
కృష్ణ గూడచారి 116 కథతో అనేక రకాల సీక్వెల్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే కాకుండా పౌరాణిక, డ్రామా, సోషల్, కౌబాయ్, వెస్ట్రన్ క్లాసిక్ అలాగే జానపద కథలు, యాక్షన్, చారిత్రక అంశాలతో కూడిన జానర్స్ ను కూడా టచ్ చేశాడు. ఇక కృష్ణ చివరగా 2016లో శ్రీ శ్రీ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి వలన ఇంటికే పరిమితమయ్యారు.


Click it and Unblock the Notifications











