Don't Miss!
- News
Wife: బిజీగా ఉంటున్న భర్త మీద కోపం, 7 నెలల కొడుకును చంపేసి ఆత్మహత్య, షాక్ !
- Finance
Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Sports
IND vs ENG: రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. 49 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
Superstar Krishna Birthday: మొదటి పాన్ వరల్డ్ మూవీ హీరో.. ఓకే ఏడాది 18 సినిమాలు.. ఏదైనా ఫస్ట్ ఆయనే!
తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రస్తావనకు వస్తే అందులో ఎవర్ గ్రీన్ టాప్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ తప్పకుండా ఉంటారు అని చెప్పవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమ మరో మెట్టుకు ఎదగడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. కేవలం బాలీవుడ్ మాత్రమే అప్పట్లో హై టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ఉన్న సమయంలో కృష్ణ గారు నిర్మాతగా సినిమాలకు అప్డేట్ అవుతూ సాంకేతిక టెక్నాలజీ జోడిస్తూ ఎన్నో సినిమాలు చేశారు. ఇక ఆయన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కానీ ఆయన ఎప్పుడూ బ్యాన్ వరల్డ్ సినిమా చేశారు. ఇక నేడు కృష్ణ గారి 79వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సాధించిన విజయాలపై లుక్కేస్తే..

మొదటి సినిమా
కృష్ణ గారి అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1943 మే 31వ ఏదైనా ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించిన ఆయన రెండు పదుల వయసులో కి వచ్చిన వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన తేనెమనసులు అనే సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ మొదటి సారి వెండితెరకు పరిచయమయ్యారు.

అగ్ర హీరోలతో సమానంగా..
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆయన అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు బ్రహ్మరథం పెట్టె స్థాయికి వచ్చారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. పద్మాలయ స్టూడియోస్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను రూపొందించారు.

ఏడాదికి 18 సినిమాలు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 350కి పైగా సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా తన టాలెంట్ ను చూపించుకున్నారు. ముఖ్యంగా నిర్మాతగా ఆయన చాలా మందికి ఉపాధి కల్పించారు. 1989 వరకు కూడా కృష్ణ గారు ఒకే ఏడాది పదికి పైగా సినిమాలు చేసేవారు. కొన్నిసార్లు ఆ లెక్క 18 వరకు కూడా వెళ్ళింది. పండండి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం.. ఇలా ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.

ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ
ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కానీ అప్పట్లోనే ఆయన వరల్డ్ సినిమా చేశాడు మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ మలయాళం బెంగాలీ కన్నడ అలాగే హాలీవుడ్ లో కూడా విడుదల అయ్యింది. ఇంగ్లీష్ లోనే కాకుండా స్పానిష్ రష్యన్ లాంగ్వేజెస్ లో కూడా ఆ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషల్లో విడుదలైన ఇండియన్ సినిమాలు కూడా మోసగాళ్లకు మోసగాడు సంచలనం సృష్టించింది.

టెక్నాలజీతో పోటీగా..
ఇక చిత్ర పరిశ్రమ అప్డేట్ అవుతున్న కాలంలోని సూపర్ స్టార్ కృష్ణ మారుతున్న కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని కూడా అప్డేట్ చేస్తూ వచ్చారు. ఫస్ట్ సోషల్ కలర్ సినిమా తేనెమనసులు, ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్ మూవీ గూడచారి 116, ఫస్ట్ కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ ఈస్ట్ మాన్ మూవీ ఈనాడు, ఫస్ట్ 70MM మూవీ సింహాసనం, ఫస్ట్ DTS మూవీ తెలుగు వీర లేవరా, ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు.. ఈ విధంగా టెక్నాలజీ లో ఏదైనా సరే మొదటి మూవీగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు.