Don't Miss!
- News
Lady: భర్త మీద కోపం, పుట్టింటిలో కూతుర్ని, అమ్మమ్మను కొట్టి చంపేసింది !
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
పవన్ కోసం త్రివిక్రమ్ వచ్చింది అందుకే: మల్టీస్టారర్ గుట్టు విప్పిన నిర్మాత.. హైలైట్ పాయింట్ రివీల్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. అదే సమయంలో రీమేక్ సినిమాల హడావిడీ ఎక్కువగా ఉంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా రీమేక్ చిత్రాలు.. మల్టీస్టారర్ మూవీలు వస్తున్నాయి. అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రాబోతున్న మాలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా భాగం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఎంట్రీ వెనుక రహస్యం బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరు హీరోల కలయికలో వస్తున్న చిత్రం
పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విభిన్న చిత్రాల దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆలస్యంగా ప్రకటించినా.. ముందే మొదలు
రీఎంట్రీలో ఫుల్ స్పీడు చూపిస్తున్న పవన్ కల్యాణ్.. 'వకీల్ సాబ్'తో కమ్‌బ్యాక్ అవుతున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు'తో పాటు హరీశ్ శంకర్‌తో ఓ సినిమాను లైన్‌లో పెట్టుకున్నాడు. వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేయాలని భావించాడు. కానీ, ఆలస్యంగా వచ్చినా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ ముందే షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో భాగం అయిన స్టార్ డైరెక్టర్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడిని ఎదురించే వ్యక్తిగా రానా నటిస్తున్నాడు. ఇగో ఉన్న ఇద్దరి మధ్య నడిచే కథతో వస్తున్న ఈ సినిమాలో మాటల మాంత్రికుడు కూడా భాగం అయ్యాడు. ఆయన ఈ మల్టీస్టారర్ మూవీకి మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ఈ సినిమాను నిర్మిస్తోన్న సూర్య దేవర నాగ వంశీ.. నితిన్ నటించిన 'రంగ్ దే'కూ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ గురించి చాలా విషయాలు వెల్లడిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్, రిలీజ్ డేట్ సహా కొన్ని విషయాలపై పరోక్షంగా స్పందిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరెన్నో అంశాలను ప్రముఖంగా చెప్పుకొచ్చాడు.

పవన్ కోసం త్రివిక్రమ్ వచ్చింది అందుకే
'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని సూర్య దేవర నాగ వంశీ రివీల్ చేశాడు. 'ఈ సినిమా దర్శకుడైన సాగర్‌కు అనుభవం తక్కువ. ఇద్దరు స్టార్ హీరోలను డీల్ చేసే సత్తా ఉన్నప్పటికీ.. ఇంటెన్స్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో అనుభవం ఉన్న దర్శకుడి సహాయం తీసుకుంటున్నాం. అందుకే త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చారు' అని చెప్పాడు.

రీమేక్ మూవీలో హైలైట్ పాయింట్ రివీల్
ఇదే ఇంటర్వ్యూలో సూర్య దేవర నాగ వంశీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ హైలైట్ పాయింట్‌ను కూడా రివీల్ చేశాడు. 'ఈ సినిమాలో త్రివిక్రమ్ గారు అందించే డైలాగ్స్ ఎంతోగానో ఆకట్టుకునేలా ఉంటాయి. అటు పవన్ గారు.. ఇటు రానా నోటి వెంట వచ్చే వాటికి థియేటర్లు దద్దరిల్లుతాయి. సినిమాలో ఇవే హైలైట్ అని చెప్పొచ్చు. ఇందులో ఆయన మార్క్ కనిపిస్తుంది' అని వివరించాడు.