For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్‌కు సింహస్వప్నంగా ఎన్సీబీ అధికారి.. సమీర్ వాంఖడే ఎవరు? ఆయన పెళ్లి చేసుకొన్న హీరోయిన్ పేరు తెలుసా?

  |

  డ్రగ్స్ మాఫియాపై, డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలు ఉన్న సినీ ప్రముఖులకు సింహస్వప్నంగా నిలస్తున్న నిఖార్సైన అధికారి సమీర్ వాంఖడే‌పైనే అందరి దృష్టి. గత కొద్దికాలంగా సినీ ప్రముఖులు, డ్రగ్స్ డీలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అయితే అక్రమార్కుల గుండెల్లో నిద్రిస్తున్న సమీర్ వాంఖడే వ్యక్తిగత జీవితం, ఆయన వివాహం చేసుకొన్న సినీ హీరోయిన్ గురించి వివరాల్లోకి వెళితే..

  Who Is Sameer Wankhede? Mumbai 'Singham' | 2011 World Cup Trophy | Aryan Khan || Oneindia Telugu
  ముంబైలో ఎన్సీబీకి జోనల్ డైరెక్టర్‌గా

  ముంబైలో ఎన్సీబీకి జోనల్ డైరెక్టర్‌గా

  సమీర్ వాఖండే విషయానికి వస్తే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ముంబైలో జోనల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధమున్న డ్రగ్స్ కేసు నుంచి షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వరకు అన్నీ సంచలన నిర్ణయాలే తీసుకొంటూ అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌ బట్టబయలు చేస్తూ సినీ తారల నుంచి పలువురిని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించారు.

   మరాఠీ నటి క్రాంతి రేద్కర్‌తో వివాహం

  మరాఠీ నటి క్రాంతి రేద్కర్‌తో వివాహం

  ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే వివాహం మరాఠీ నటి క్రాంతి రేద్కర్‌తో జరిగింది. మరాఠీ చిత్రం పరిశ్రమలో క్రాంతి రేద్కర్‌ అద్భుతమైన పాత్రలతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకొన్నారు. దేశం కోసం తన భర్త ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కుటుంబానికి, పిల్లలకు దూరంగా ఉంటూ తన జీవితాన్ని పణంగా పెట్టి డ్రగ్స్ కేసు విచారణకు అంకితం చేస్తున్నారు. అధికారిగా సమీర్ అందుకొంటున్న ప్రశంసలు చూస్తే ఆనందం కలుగుతుంది. కొన్నిసార్లు ఆయన ప్రాణాలు ముప్పు వాటిల్లుందనే భయం కలుగుతుంది అని క్రాంతి రేద్కర్ తెలిపారు.

  బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు

  బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు

  గతంలో కూడా సమీర్ వాంఖడే ఎన్నో కేసులను సంచలనాత్మక రీతిలో బట్టబయలు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన పేరు మీడియాలోను, ప్రజా క్షేత్రంలో మార్మోగుతున్నది. ముఖ్యంగా బాలీవుడ్‌కు డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలను ఆయన విచ్ఛిన్నం చేస్తున్నారు కనుక మరింత అటెన్షన్ పెరిగింది. ఒక్కసారి 24 గంటల్లో కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయిన రోజులు ఉన్నాయి. అంకితభావం, కష్టపడి పనిచేస్తుంటాడు. ప్రతీ రోజు రకరకాల సీక్రెట్ ఆపరేషన్లు చేస్తుంటారు అని హీరోయిన్ క్రాంతి రేద్కర్ చెప్పారు.

  డ్యూటీ కోసం పిల్లలకు దూరంగా

  డ్యూటీ కోసం పిల్లలకు దూరంగా

  మాకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. సమీర్ ఎప్పుడూ కేసులు, రైడింగ్, విచారణ, దర్యాప్తు ఇలాంటి వ్యవహారాలతో బిజీగా ఉంటారు. చాలా సార్లు పిల్లలు తండ్రి కోసం చూస్తుంటారు. తండ్రిగా ఆయన కూడా పిల్లలకు సమయాన్ని కేటాయించలేకపోవడం పై కూడా ఆయన బాధపడుతుంటారు. కానీ ఆయన బాధ్యతలను గుర్తించి.. ఇంటిని, పిల్లల సంరక్షణను నేను చూసుకొంటాను. కానీ దేశానికి ఆయన చేస్తున్న సేవలు చూసి నేను చాలా గర్వపడుతాను అంటూ సమీర్ వాంఖడే భార్య క్రాంతి రేద్కర్ అన్నారు.

  అక్రమార్కులపై జోరుగా కొరడా? మితాభాషి..

  అక్రమార్కులపై జోరుగా కొరడా? మితాభాషి..

  అవినితీ, అక్రమార్కులపై కొరడా ఝులిపించే సమీర్ వాంఖడే మితభాషి. చాలా తక్కువగా మాట్లాడుతారు. కానీ బాలీవుడ్‌లో సెలబ్రిటీలతో డీల్ చేస్తున్న కారణంగా ఆయనపై కూడా మీడియా దృష్టి భారీగానే ఉంది. ఇటీవల కాలంలో చాలా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుండటం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన పనీతీరు, ధైర్యం చూస్తే చాలా సంతోషం, గర్వంగా ఉంటుంది అని క్రాంతి రేద్కర్ తెలిపారు.

  English summary
  Narcotics Control Bureau investigating Sushant Singh Rajput to Aryan Khan cases: NCB Zonal officer Sameer Wankhede playing crucial role. He married to Actress Kranti Redkar. Some more personal details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X