For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హిట్టుకొట్టి తలపట్టుకున్న దర్శకులు.. ఈ వెయిటింగ్ కరోనా కంటే టఫ్!

  |

  సౌత్ ఇండియన్ దర్శకులు చాలా వరకు తెలివిగా ఆలోచిస్తారని బాలీవుడ్ బడా దర్శకులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా మేకింగ్ విషయంలో అయినా కెరీర్ విషయంలో అయినా టాలీవుడ్, కోలీవుడ్ దర్శకులు చాలా బాగా ప్లాన్ చేసుకుంటారని ఒక గుర్తింపు ఉంది. మెయిన్ గా తెలుగు దర్శకులు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను లైన్ లో పెట్టేస్తారు. అయితే దురదృష్టవశాత్తు భారీ సక్సెస్ లు అందుకున్న కొందరు దర్శకులు ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

   అర్జున్ రెడ్డి దర్శకుడి జాడే లేదు?

  అర్జున్ రెడ్డి దర్శకుడి జాడే లేదు?

  అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది. అనంతరం చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో అదే కథతో మరో పెద్ద హిట్టు కొట్టాడు. అయితే ఏళ్ళు గడుస్తున్నా ఇంకా తన తదుపరి తెలుగు సినిమా గురించి ఎలాంటి ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఆ మధ్య మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పుటికీ వర్కౌట్ కాలేదు.

   కొరటాల ఎంత ప్రయత్నం చేసినా..

  కొరటాల ఎంత ప్రయత్నం చేసినా..

  ఇక వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న కొరటాల శివ కూడా వెయిట్ చేయక తప్పడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. ఈ ఏడాది వచ్చే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎంత ప్రయత్నం చేసినా షూటింగ్ కి మెగాస్టార్ అయితే ఇప్పట్లో రాలేరని అర్ధమయ్యింది. దీంతో కొరటాలకు ఆడియెన్స్ కి లాంగ్ గ్యాప్ ఏర్పడుతోంది.

  ఆయన దురదృష్టం ఏమిటో?

  ఆయన దురదృష్టం ఏమిటో?

  RX100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి దురదృష్టం ఏమిటో గాని ఎవ్వరికి అర్థం కావడం లేదు. మహాసముద్రం అనే ప్రాజెక్టును ఎప్పటి నుంచో సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు. ఇక నటీనటులను వెతుక్కుంటున్న సమయంలో కరొనా లాక్ డౌన్ మరింత దెబ్బకొట్టింది.

  సుకుమార్ కి కూడా తప్పడం లేదు?

  సుకుమార్ కి కూడా తప్పడం లేదు?

  రంగస్థలం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సుకుమార్ అంతకు మించి అనేలా బన్నీతో పుష్ప సినిమాను మొదలుపెట్టారు. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఆ సినిమా అలా మొదలుకగానే షూటింగ్ కి బ్రేక్ పడింది. కెరీర్ లో మొదటి సారి భారీ స్కెల్ లో సినిమాను ప్లాన్ చేసుకున్న సుకుమార్ కి మొదటి సారి లాంగ్ గ్యాప్ ఏర్పడింది.

  రాజమౌళి బాధ మరీ దారుణం

  రాజమౌళి బాధ మరీ దారుణం

  అంధరికంటే ఎక్కువగా రాజమౌళి ఇబ్బంది పడుతున్నాడాని చెప్పవచ్చు. దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా మధ్యలో ఆగింది అంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. RRR సినిమా వచ్చే ఏడాది రావడం కూడా అనుమానంగానే ఉంది.

  పూరికి ఇష్టం లేని వెయిటింగ్

  పూరికి ఇష్టం లేని వెయిటింగ్

  పూరి జగన్నాథ్ కొంత సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ ఆయనకు ఖాళీగా ఉండడం అంటే యమ చిరాకు. సినిమా షూటింగ్ తొందరగా ఫినిష్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇక విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే ఊహించని విధంగా ఆపేయాల్సి వచ్చింది.

  Thaman Vs Devi Sri Prasad : Musical Fight In Tollywood
   శేఖర్ కమ్ముల కష్టాలు..

  శేఖర్ కమ్ముల కష్టాలు..

  సింపుల్ అండ్ క్యూట్ కథలతో ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సక్సెస్ తరువాత చాలా పెద్ద గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం లవ్ స్టొరీ. ఆల్ మోస్ట్ ఆ సినిమా షూటింగ్ పూర్తవుతున్న తరుణంలో కరోనా దెబ్బ కొట్టింది. మరి ఈ వెయిటింగ్ టెన్షన్ ని దర్శకులు ఇంకా ఎన్ని రోజులు భరిస్తారో చూడాలి.

  English summary
  Tollywood star heroes have been making movies with star directors lately. As the market grows, producers are also not adding new directors to star heroes. As far as possible, the directors who are blinding Labal with commercial films are selecting. Recently, Allu Arvind made a huge remuneration offer for his son, a star director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X