Just In
- 10 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
Don't Miss!
- News
రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సర్కార్ పోరాటం, న్యాయ వ్యవస్థల నిర్ణయం : ఏపీ ఎన్నికలపై దేశం ఫోకస్
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RED ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఊహించని సంఘటన: ఏడుస్తూ ఆయన కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కెరీర్ ఆరంభంలో అద్భుతమైన డైలాగ్స్‌తో ఆకట్టుకున్న ఆయన మాటల మాంత్రికుడు అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక, దర్శకుడిగా మారిన తర్వాత వరుస విజయాలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే బడా హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్‌కు చేరుకున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఆయన రామ్ 'రెడ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చారు. స్టేజ్‌పై మాట్లాడుతోన్న సమయంలో ఏడుస్తూ ఒకరి కాళ్లు పట్టుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

అప్పుడే ఎంట్రీ.. ఆ సినిమాతో డైరెక్టర్‌గా
వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘స్వయంవరం' సినిమాతో రైటర్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆయన.. ఆ తర్వాత కొన్నింటికి కథలను, మాటలను అందించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక, తరుణ్ హీరోగా నటించిన ‘నువ్వే నువ్వే'తో దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడీ టాలెంటెడ్ డైరెక్టర్.

బడా హీరోలతో భారీ విజయాలతో సత్తా
‘నువ్వే నువ్వే' సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే స్టార్ హీరో మహేశ్ బాబుతో ‘అతడు' అనే సినిమా చేశాడు త్రివిక్రమ్. ఇది కూడా సక్సెస్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్‌తో ‘జల్సా' చేశాడు. అప్పటి నుంచి వరుసగా బడా హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడాయన. ఈ క్రమంలోనే ఎన్నో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు.

ఇండస్ట్రీ హిట్ కొట్టి.. మరోసారి అతడితో
గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. దీని తర్వాత మాటల మాంత్రికుడు.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘అరవింద సమేత' వచ్చిన విషయం తెలిసిందే.

రామ్ సినిమా ఫంక్షన్‌కు ముఖ్య అతిథి
‘ఇస్మార్ట్ శంకర్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత రామ్ నటించిన చిత్రం ‘రెడ్'. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు మాటల మాంత్రికుడు ముఖ్య అతిథిగా విచ్చేసి.. టీమ్‌కు బెస్ట్ విసెష్ తెలియజేశాడు.

త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్‌కు రెస్పాన్స్
ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ హీరో రామ్‌లోని ప్రత్యేకమైన నైపుణ్యం గురించి వెల్లడించాడు. ‘రామ్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అతడిలోని టాలెంట్ నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే చెబుతున్నా. ‘ఇస్మార్ట్ శంకర్' కేవలం నీకు తొలి మెట్టు. నువ్వు ఇంకా ఇంకా పైపైకి ఎదుగుతావ్' అని చెప్పాడు. అలాగే, స్రవంతి రవి కిశోర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడాయన.

ఏడుస్తూ ఆయన కాళ్లు పట్టుకున్నాడు
ఈ ఫంక్షన్‌లో నిర్మాత స్రవంతి రవి కిశోర్‌తో తనకున్న అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడాడు త్రివిక్రమ్. అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోన్న సమయంలో ఫోన్ చేసి మరీ చాన్స్ ఇచ్చారని చెప్పిన ఆయన.. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణంగా నిలిచారని తెలిపాడు. అలా చాలా సేపు మాట్లాడిన త్రివిక్రమ్ ఏడుస్తూ రవి కిశోర్ కాళ్లకు నమస్కారం చేశాడు.