For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Uday Kiran Birthday: సైడ్ క్యారెక్టర్ కోసం వచ్చి హీరోగా క్లిక్కయిన ఉదయ్.. త్వరలోనే ఆఖరి సినిమా!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆడియెన్స్ నుంచి ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ని అందుకున్న హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకడు. నెగిటివ్ కామెంట్స్ చేయకుండా అన్ని వర్గాల అభిమానులు అతన్ని ఇష్టపడేవారు. నేడు ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా.. అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఉదయ్ కిరణ్ ని గుర్తు చేసుకుంటూ.. అలాంటి హీరో మళ్ళీ రాలేడని కామెంట్ చేస్తున్నారు. ఇక ఉదయ్ కెరీర్ పై ఒక లుక్కేస్తే..

  స్టార్ హీరోల రేంజ్ లో..

  స్టార్ హీరోల రేంజ్ లో..

  2000వ సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ కొన్నాళ్లకే స్టార్ హీరోల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు. నువ్వు నేను - మనసంతా వంటి సినిమాలు ఉదయ్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశాయి. యూత్ లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా ఉదయ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

  ఒక మంచి నటుడు అవ్వాలని..

  ఒక మంచి నటుడు అవ్వాలని..

  చూస్తుండగానే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద తన క్రేజ్ ని పెంచుకున్న ఉదయ్ కొన్నాళ్ళు ప్రేమలకు సంబంధించిన వివాదాలతో ఇబ్బంది పడ్డాడు. కెరీర్ మొదట్లోనే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఉదయ్ హీరోగా అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదట. ఒక యాక్టర్ గా కొనసాగాలని మాత్రమే ప్రయత్నాలు చేశాడు.

   హీరో ఫ్రెండ్ పాత్ర కోసం..

  హీరో ఫ్రెండ్ పాత్ర కోసం..

  చిత్రం సినిమా ఆడిషన్స్ కి వెళ్లిన ఉదయ్ కిరణ్ హీరో పాత్ర కోసం వెళ్లలేదట. ఉషా కిరణ్ మూవీస్ ఆడిషన్స్ అనగానే కళ్ళు మూసుకొని ఆడిషన్స్ కి వెళ్లి తన స్మైల్ తోనే డైరెక్టర్ తేజను ఎట్రాక్ట్ చేశాడు. అందులో హీరో ఫ్రెండ్ గ్యాంగ్ లో ఒక చిన్న రోల్ ఇచ్చారట. ముందుగా చిత్రం సినిమా కోసం దర్శకుడు తేజ ఒక హిందీ హీరోను అనుకున్నాడు.

  అనుకోకుండా అవకాశం..

  అనుకోకుండా అవకాశం..

  అయితే ఆ హిందీ హీరో చిత్రం సినిమాను చేయడానికి తటపటాయిస్తుండడంతో దర్శకుడు తేజ ఉదయ్ ని ఫిక్స్ చేశాడు. ఆ విదంగా మొదటి అవకాశాన్ని అనుకోకుండా దక్కించుకున్న ఉదయ్ అనంతరం మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సక్సెస్ అయ్యాడు.

   ఓటమితో ఫైట్ చేశాడు..

  ఓటమితో ఫైట్ చేశాడు..

  కొన్నాళ్లకు కెరీర్ డౌన్ అవ్వడంతో డిప్రెషన్ కి గురైన ఉదయ్ కిరణ్ చాలా వరకు ఓటములతో ఫైట్ చేశాడు. కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఉదయ్ చివరికి హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హీరో మరణించి అరేళ్లవుతున్నా ఇంకా ప్రేక్షకుల మనసుల్లో అలానే బ్రతికి ఉన్నాడు.

  Sushant Singh Rajput కూడా Uday Kiran లాగా నే ! ఇద్దరిలో ఒక కామన్‌ పోలిక...!!
  ఆఖరి సినిమా..

  ఆఖరి సినిమా..

  ఉదయ్ కిరణ్ చివరి సినిమా రిలీజ్ కాకుండానే అటకెక్కడం అప్పట్లో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. 'చిత్రం చెప్పిన కథ' అనే సినిమాలో ఆఖరి సారిగా నటించిన ఉదయ్ కిరణ్ ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా పాల్గొన్నారు. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఉదయ్ ఆత్మహత్య అనంతరం ఆ సినిమా గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇక ఇన్నాళ్లకు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Uday Kiran's last film release was big suspension. Uday Kiran, who made his last appearance in the movie 'chitram cheppina Katha', made many attempts to release the film. Also participated in some promotions events. But after Uday's suicide, who cares about the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X