Just In
- 13 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లవర్స్ డే స్పెషల్: ప్రేమపై బ్లాక్‌బస్టర్ సినిమాలు.. భారీ కలెక్షన్లు
ఈ సృష్టిలో ఎంతో విలువైంది ఒక్క ప్రేమ మాత్రమే. అది అక్షర సత్యం. ప్రేమను మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. అయితే ఈ ప్రేమ పలు రకాలుగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ప్రేమకు అర్థం మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆడ, మగ మధ్య పుట్టే ప్రేమకు ప్రతీకగా ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటారు. లవర్స్ అంతా ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ సరదాగా గడుపుతుంటారు.

ప్రేమికుల ఎదురుచూపు.. టాలీవుడ్ మూవీస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూసే ఈ రోజు (ఫిబ్రవరి 14) రానే వచ్చింది. నేడే ప్రేమికుల పండుగ (వాలెంటైన్స్ డే). ప్రేమికులకు ఈ వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైంది. ఇకపోతే ఈ ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ టాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. ఈ సందర్భంగా ఓసారి ఆ సినిమాలను గుర్తు చేసుకుందామా..

ప్రేమ పేరుతో సినిమాలు.. అన్నీ
ఈ ప్రేమ పేరుతో తెలుగు చిత్రసీమలో చాలా సినిమాలు వచ్చాయి. ప్రేమ, ప్రేమకు వేళాయరా, ప్రేమించు, ప్రేమదేశం, ప్రేమికుడు, ప్రేమికుల రోజు, ప్రేమంటే ఇదేరా, తొలి ప్రేమ, ప్రేమ పావురం, ప్రేమాభిషేకం, ప్రేమించుకుందాం రా, ప్రేమ సందేశం.. ఇలా ఎన్నో సినిమాలతో ప్రేమ గొప్పతనం చాటారు తెలుగు దర్శకనిర్మాతలు.

తొలి ప్రేమ.. పవన్ కళ్యాణ్
24 జులై 1998 లో పవన్ కళ్యాణ్ హీరోగా ఏ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందింది తొలి ప్రేమ సినిమా. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. లవ్‌లో ఉన్న ఎమోషన్స్, అట్రాక్షన్స్, ప్రేమ విలువ తెలుపుతూ యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. అంతేకాదు నేషనల్ అవార్డు కూడా గెలుచుకొని తెలుగు ప్రేమకథ సత్తా చాటింది.

మనసంతా నువ్వే.. ఉదయ్ కిరణ్
19 అక్టోబర్ 2001న వచ్చిన 'మనసంతా నువ్వే' సినిమా ప్రేమికుల మనసు దోచుకుంది. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రేమాయణం ప్రేమికుల హృదయాలను హత్తుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు నేటికీ ప్రేమికుల మదిలో మెదులుతూనే ఉంటాయి.

హ్యాపీ అంటూ రంగంలోకి అల్లు అర్జున్
ఇకపోతే 'హ్యాపీ' అంటూ రంగంలోకి అల్లు అర్జున్ దిగాడు. 27 జనవరి 2006న విడుదలైన ఈ సినిమా మోడ్రన్ హంగులతో రూపొంది క్లాస్, మాస్ ప్రేమికులందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో అల్లు అర్జున్, జెనీలియా మధ్య వచ్చిన సన్నివేశాలు యువతను అట్రాక్ట్ చేశాయి.

వరల్డ్ ఫేమస్ లవర్.. లవ్ స్టోరీ
టాలీవుడ్ లో ప్రేమకథల వాల్యూ నానాటికీ పెరిగిపోతోంది. ఇక ఈ రోజే వరల్డ్ ఫేమస్ లవర్ పేరుతో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ మూవీ ప్రేమికులకు బెటర్ ఛాయిస్ అని తెలుస్తోంది. మరోవైపు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' పేరుతో మరో సినిమా రెడీ చేశాడు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.