For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమంత, నాగ చైతన్యలా.. బిగ్ బాస్ తర్వాత ఆ జంటకు డిమాండ్ పెరిగిందట.!

By Manoj
|

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహం చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. అందుకే ఇలాంటి జంటలను ఇక్కడ కొంచెం స్పెషల్‌గా చూస్తుంటారు. అయితే, వివాహం తర్వాత కూడా తమ తమ పనులతో బిజీగా గడిపే వాళ్లను మాత్రం వేళ్లపై లెక్కించవచ్చు. ఇలాంటి వారిలో అక్కినేని నాగ చైతన్య, సమంత పేరు ప్రధమంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఈ జంట వివాహం తర్వాత కూడా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అందుకే వీళ్లకు డిమాండ్ భారీగా ఉంది. అంతేకాదు, కలిసి కూడా సినిమాలు, యాడ్స్ చేస్తూ నాలుగు చేతుల నిండా సంపాదిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌లోని మరో జంట వీళ్ల బాటలో పయనించబోతుంది. ఇంతకీ ఎవరా దంపతులు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

సినిమా చేసే సమయంలోనే ప్రేమ

సినిమా చేసే సమయంలోనే ప్రేమ

వరుణ్ సందేశ్.. యంగ్ హీరోగా ఇతను ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే. ‘హ్యాపీడేస్' సినిమాతో వెండితెరపై కాలుమోపిన ఈయన.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకాదరణ పొందాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన వితిక షేరు.. ఆ తరువాత వరుణ్ సందేశ్‌తో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన వరుణ్ సందేశ్- వితిక షేరు ఆ తర్వాత పెళ్లి పీటలెక్కి ఒక్కటయ్యారు.

జంటగా ఎంటర్ అయ్యారు

జంటగా ఎంటర్ అయ్యారు

వరుణ్ సందేశ్ - వితిక షేరు.. వీళ్లిద్దరూ కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. దీనికి కారణం ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడమే. బిగ్ బాస్ మొత్తానికి ఈ కపుల్ కొంచెం స్పెషలనే చెప్పాలి. షో చరిత్రలోనే దంపతులను తీసుకొచ్చిన దాఖలలు లేవు. ఈ సీజన్‌లో జంటగా రావడంతో అందరి కళ్లు వీళ్ల పైనే పడ్డాయి. హౌస్‌లోకి ఎంటరయ్యే సమయంలోనే వరుణ్.. వితికను ఎత్తుకుని తీసుకెళ్లడం మరింత హైలైట్ అయింది.

Bigg Boss Telugu 3 : Varun Sandesh Eviction Announced By Srikanth & Catherine Tresa
రొమాన్స్‌తో మరింత హైలైట్

రొమాన్స్‌తో మరింత హైలైట్

హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం హాట్ టాపిక్ అయింది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం.. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట గడిపింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కనిపించాయి. బాత్ టబ్‌లో రొమాన్స్, దుప్పట్లో దూరిపోవడం వంటి వాటితో ఈ జంట మరింత హైలైట్ అయింది.

వితిక వెళ్లినా వరుణ్ ఉన్నాడు

వితిక వెళ్లినా వరుణ్ ఉన్నాడు

దాదాపు పదమూడు వారాల పాటు ఎలాగోలా నెట్టుకొచ్చింది వితిక. మొదట్లో అందరిపై ఈమె నోరు పారేసుకున్నప్పటికీ, తర్వాత హౌస్‌మేట్స్‌కు క్లోజ్ అయిపోయింది. అయితే, షో చివర్లో వితిక ఎలిమినేట్ అయిపోయింది. కానీ, వరుణ్ సందేశ్ మాత్రం నిజాయితీగా ఆడుతూ ఫైనల్ వరకు ఉన్నాడు. టాప్ -5లో చోటు దక్కించుకున్న అతడు.. నాలుగో స్థానాన్ని మాత్రమే దక్కించుకున్నాడు. అయినప్పటికీ వరుణ్‌కు మంచి పేరు వచ్చింది.

షో తర్వాత పెరిగిన డిమాండ్

షో తర్వాత పెరిగిన డిమాండ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న జంటల్లో సమంత, నాగ చైతన్యకు మాత్రమే మంచి డిమాండ్ ఉందన్న టాక్ ఉంది. వీళ్లిద్దరూ యాడ్స్ చేయాలన్నా, కలిసి సినిమాలో నటించాలన్నా చాలా చార్జ్ చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లలా టాలీవుడ్‌లో పేరున్న జంటలు లేకపోవడమేనట. అయితే, బిగ్ బాస్ తర్వాత వరుణ్ సందేశ్ - వితిక షేరుకు కూడా డిమాండ్ భారీగానే పెరిగిందని అంటున్నారు.

వాళ్లంతా ఇంటికి క్యూ కడుతున్నారట

వాళ్లంతా ఇంటికి క్యూ కడుతున్నారట

బిగ్ బాస్ షో తర్వాత వరుణ్ సందేశ్ - వితిక షేరు గతంలో కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి తోడు సినీ జంట కావడంతో.. యాడ్ ఫిల్మ్ మేకర్లు వీళ్లతో వ్యాపార ప్రకటనలు చేయడానికి సిద్ధం అవుతున్నారట. షో ముగిసి పది రోజులు కూడా కాకముందే చాలా మంది ఫిల్మ్ మేకర్లు వీళ్ల ఇంటికి క్యూ కడుతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ జంటకు డిమాండ్ పెరగడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Varun Sandesh is popular among youths, none knows about his wife Vithika who has appeared in a couple of movies as a heroine. But then, thanks to her negative thinking and fake emotions, which became highly popular during Bigg Boss Season 3 and she became a household name.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more