»   » 18 నిముషాలు వీడియో లీక్: 'పులి' టీమ్ మొత్తం షాక్

18 నిముషాలు వీడియో లీక్: 'పులి' టీమ్ మొత్తం షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రిలీజ్ కాకముందే చిత్రానికి సంభందించిన వీడియోలు లీక్ అయ్యి నిర్మాతలను టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య బాహుబలి చిత్రానికి అలాగే జరిగింది. ఇప్పుడు విజయ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పులి చిత్రానికి జరిగింది. దాదాపు 18 నిముషాల వీడియో బయిటకు వచ్చిందని సమాచారం.

లీక్ అయ్యిన వీడియో లో కథ ప్రకారం...విజయ్ గర్ల్ ప్రెండ్ నందిత శ్వేత...కొందరి చేతిలో దారుణంగా చంపబడుతుంది. ఆ భాధ ని తట్టుకోలేని విజయ్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా ఓ కొండమీద నుంచి దూకేస్తాడు. అయితే చిత్రంగా అతను ఓ కొత్త ప్లేస్ లోకి వెళ్తాడు. అక్కడ శ్రీదేవి రాణిగా చేస్తూంటుంది. అక్కడ విజయ్ పాపులారిటి పెరిగిపోతూండటంతో అక్కడ సైన్యాధిపతి సుదీప్ కుట్ర చేసి ఓ తప్పుడు గొడవలో ఇరికిస్తాడు. అతనిమీద పడిన నిందని నమ్మని శ్రీదేవి తన శక్తులతో అతని గతం చదువుతుంది. అతని గతంలో ...విజయ్ మరెవరో కాదు తన తప్పిపోయిన కుమారుడే అని అర్దమవుతోంది. అప్పుడు శ్రీదేవి ఏంచేసింది. విజయ్ ఏం నిర్ణయం తీసుకున్నాడనేది మిగతా కథ అంటున్నారు.

'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజరు లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న 'పులి'. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవలే రిలీజ్‌ అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ''మా 'పులి' చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒక్కరోజులోనే 20 లక్షల హిట్స్‌ సాధించి కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

18 Minute Video Of Vijay's Puli, The Entire Team Is In Shock

పి.కె. చిత్రాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం టీజర్‌కి హిట్స్‌ రావడం ఆనందంగా వుంది. ఈ టీజర్‌ని చూసి విజరు తమకు అందించిన బర్త్‌డే గిఫ్ట్‌గా ఫీల్‌ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవిగారు రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. 'పులి' చిత్రం విజరు కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

తమిళంలో ఎన్నో చిత్రాలకు బాణీలు అందించిన దేవిశ్రీ ఈ చిత్రం విడుదలకాకముందే ప్రశంసలు అందుకుంటున్నారు. డిఫరెంట్ కథాంశంతో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుతున్న ఈ చిత్రంలోని పాటలు విని నిర్మాతలు దేవిశ్రీప్రసాద్‌ను అభినందించారు. ఆయనకు బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించారట.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- విజయ్‌తో సినిమా అంటేనే చాలా హైప్‌లో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ‘పులి' అనే పేరును ప్రకటించగానే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను కంపోజ్ చేశాను. అందులో ఒక పాట చిత్రీకరణ పూర్తయింది. మరోపాట సాగుతోంది. మూడోపాట రికార్డింగ్ దశలో ఉంది. విజయ్‌ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపేలా ఈ చిత్రం ఉంటుంది. ఫాంటసీ చిత్రమైనా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్‌కాకుండా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలో ఓ అద్భుతాన్ని సృష్టిస్తోంది. నేను కూడా ఈ చిత్రం విడుదలకోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.


శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
An eighteen minute video has been leaked on the internet which narrates yet another story of Ilayathalapathy Vijay's Puli, according to a source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu