ప్రేమమ్ హీరో నవీన్ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రభు రాధాకృష్ణ డైరెక్షన్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 24ఏఎం స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో ప్రేమమ్ హీరో నవీన్ పౌలీ హీరోగా నటిస్తుండగా, ప్రభు రాధకృష్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 24ఏఎం స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ హీరో నవీన్ పౌలీ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా, ప్రభు రాధకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత డీ రాజా స్వయంగా కథ, మాటలు అందించడం విశేషం.

పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ
దేశ సినీ పరిశ్రమలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన పీసీ శ్రీరాం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. జూలైలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. హీరో నవీన్ పౌలీకి తమిళంలో ఇది రెండో చిత్రం.

రాధాకృష్ణన్ కెరీర్..
2006లో ప్రముఖ టీవీ ఛానెల్ విజయ్ టీవీలో కన్నా కానమ్ కాలంగల్ అనే మెగా సీరియల్‌కు దర్శకత్వం వహించడం ద్వారా ప్రభు రాధాకృష్ణన్ తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్లో ఆ సీరియల్ అత్యంత ప్రజాదరణను పొందింది. ఆ తర్వాత 2009లో పట్టాలం సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు.

శివకార్తీకేయన్ ప్రోమో పాటకు దర్శకత్వం
2013లో హీరోయిన్ అనన్య ప్రధాన పాత్రగా రూపొందిన మలయాళ టెలిఫిలిం దూరేకు దర్శకత్వం వహించారు. డీ రాజా నిర్మించిన రెమో సినిమాకు సిరికత్తె అనే ప్రోమో పాటకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శివకార్తీకేయన్, కీర్తీ సురేశ్, అనిరుధ్ రవిచంద్రన్ నటించారు. ప్రభు రూపొందించిన ప్రోమో పాట విశేష ఆదరణను చూరగొన్నది.

ప్రభు, నవీన్ కాంబినేషన్ మంచి క్రేజ్
ప్రస్తుతం ప్రభు రాధాకృష్ణన్, నవీన్ పౌలీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం బహుభాషా చిత్రంగా రూపొందింది. ప్రభు దర్శకత్వం వహించే సినిమా విజయవంతం కావాలని ఫిల్మీబీట్ ఆశిస్తున్నది.


Click it and Unblock the Notifications











