twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మతిపోగొడుతున్న రజనీ ‘కొచ్చాడయాన్’ రేంజ్..

    By Bojja Kumar
    |

    నిజంగానే మతి పోతోంది. ఆ రేంజ్‌లో రూపొందుతోంది బడా హీరో రజనీకాంత్ తాజా సినిమా 'కొచ్చాడయాన్'. ఈ సినిమా చిత్రీకరణ కోసం మొత్తం 80 కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె నటిస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రోబో తర్వాత రజనీ 'రాణా' చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి గురి కావడం సినిమా అటకెక్కింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రజనీ మళ్లీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్నారు.

    ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

    ఈచిత్రం ద్వారా రజనీ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వంలో సౌందర్యకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ చిత్రం యొక్క డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉందని, తెలుగు ఈ చిత్రానికి 'ఖడ్గ రుద్ర' అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Rajinikanth’s forthcoming film Kochadaiyaan Ranadhiran being produced and directed by his daughter Soundarya will be the first Indian film to employ Motion Capture technology (MOCAP) and will employ 80 cameras.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X