twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాక్టర్లకు 'ఐ' టిక్కెట్లు కొనిచ్చాడు

    By Srikanya
    |

    చెన్నై : విక్రం హీరోగా నటించి ఇటీవల తెరపైకి వచ్చిన చిత్రం 'ఐ'. ఈ సినిమా టిక్కెట్లను ఆ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు, నర్సులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన తల్లి ఇటీవల అనారోగ్యం పాలవడంతో నగరంలోని ఆ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు, నర్సులు అందించిన సేవలకు రెహ్మాన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. వారు ఆనందించేలా ఏదైనా చేయాలని భావించారు. అలా 'ఐ' చిత్రం టిక్కెట్లను కొనుగోలు చేసి వైద్యులు, నర్సులకు అందజేశారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    మరో ప్రక్క ... 'శంకర్‌ ఇంటి ముందు ధర్నా చేస్తాం'

    శంకర్‌ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'ఐ' చిత్రంలో తమను తీవ్రంగా విమర్శించారని, ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహిస్తామని హిజ్రాల సంఘం వెల్లడించింది. ఈ చిత్రంలో రాజాని అనే హిజ్రా విలన్‌ పాత్ర పోషించింది. ఈమె ప్రముఖ మోడల్‌గా కూడా గుర్తింపు పొందారు. 'ఐ'లో ఈమెను క్రూరంగా చిత్రీకరించినట్లు వారు ఆరోపించారు. ఈ పాత్ర ద్వారా హిజ్రాలను అవమానపరిచినట్లు ఉందంటూ పేర్కొన్నారు. సంతానం ఈ చిత్రంలో హిజ్రాలపై చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు.

    A.R Rehman offers I tickets to Apollo doctors

    విక్రమ్‌ నటించిన 'ఐ' చిత్రం ఎట్టకేలకు బుధవారం విడుదలైంది. అభిమానులు సినిమా థియేటర్ల వద్ద టపాసులు కాల్చుతూ పండుగ వాతావరణం సృష్టించారు. తమ అభిమాన నటుడి కటౌట్లకు పూలమాలలు వేసి సందడి చేశారు. థియేటర్లలో వారు కేరింతలు కొడుతూ గడిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు భాషల్లోనూ విడుదలైంది. కోర్టు కేసు, అప్పుల సమస్యతో ఈ చిత్రం విడుదల కావడం ఇంతకాలం జాప్యమైంది. ఈ కష్టాల నుంచి బయటపడి ఎట్టకేలకు చిత్రం బుధవారం తెరపైకొచ్చింది.

    అమెరికా, జపాన్‌, చైనా తదితర పలు దేశాల్లో సుమారు 2,500 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. తొలిసారిగా పాకిస్థాన్‌లో తమిళుల చిత్రం హిందీలో అనువాదమై విడుదలైంది. తమిళనాట మాత్రం సుమారు 400 థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కథానాయకుడు విక్రమ్‌ సరసన ఎమీజాక్సన్‌ నటించింది. మూడు సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్‌ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సన్నివేశాలకు తగ్గట్టుగా తన శరీర బరువును తగ్గించడం, పెంచడం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ చిత్రం కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన ఈ శ్రమ వృథా కాలేదని చిత్ర బృందం పేర్కొంది.

    చిత్రం కథేమిటంటే...

    లింగేష్(విక్రమ్) ఆర్నాల్డ్ జిమ్ లో ఔత్సాహిక బాడీ బిల్డర్. అతని జీవితాశయం మిస్టర్ ఇండియా అవ్వాలని. ఈ లోగా మిస్టర్ ఆధ్రప్రదేశ్ అవుతాడు. అయితే ఆ గెలుపు నుంచే అతనికి శతృవులు మొదలవుతారు. మరో ప్రక్క అతను ...దియా(అమీ జాక్సన్) అనే మోడల్ ని ఆరాధిస్తూంటాడు. ఆమెకు తన తోటి మోడల్ జాన్(ఉపేన్ పటేల్) నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతాయి. వాటినుంచి తప్పించుకుని తన కెరీర్ ని నిలబెట్టుకోవటం కోసం లిగేష్ ని మోడల్ గా ప్రమోట్ చేసి వాడుకోవాలనుకుంటుంది. అయితే ఆమె లింగేష్ తో ప్రేమలో పడుతుంది.

    అంతేకాకుండా ఆ పెయిర్ మోడలింగ్ ఫీల్డ్ లో హాట్ గా మారతారు. దాంతో ఆమె ఫ్రొఫిషనల్ వైపు నుంచి లింగేష్ కు శతృవులు ప్రారంభమవుతారు. ఈ లోగా ఊహించని విధంగా ..లింగేష్ ..ఓ అంతుపట్టని వ్యాధి వచ్చి కురూపిలా(ట్రైలర్ లో చూపినట్లు బొబ్బలతో) మారిపోవటం మొదలవుతాడు. ఇంతకీ లింగేష్ అలా మారటానికి కారణం ఏమిటి... దాని వెనక ఉన్న కుట్రను లింగేష్ ఎలా ఛేధించాడు..లింగేష్...దియా ల ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ.

    English summary
    Rehman who recently composed tunes for Shankar’s I movie offered bulk tickets to the Apollo group of doctors in Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X