For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అప్పట్లో చిరంజీవి.. ఇప్పుడు రామ్‌చరణ్‌

  By Srikanya
  |

  చెన్నై : మహేష్‌బాబు నటించిన 'సెల్వందన్‌' (శ్రీమంతుడు) చిత్రం అనువాదం తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న 'బ్రూస్‌లీ ' చిత్రాన్ని 'బ్రూస్‌లీ 2' టైటిల్ తో తమిళంలోకి తీసుకొస్తున్నారు భద్రకాళి ఫిలిమ్స్‌ అధినేత ప్రసాద్‌. శీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న సినిమా 'బ్రూస్‌లీ'. ఈ సినిమా తమిళంలో 'బ్రూస్‌లీ 2'గా విడుదలవుతోంది. 150 పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ ట్రైలర్ ఇక్కడ చూడండి.

  ఈ చిత్రానికి తమిళంలో ఏఆర్‌కే రాజరాజ మాటలు రాశారు. ఆయన మాట్లాడుతూ రామ్‌చరణ్‌ సినిమాకు తమిళనాట మంచి క్రేజీ ఉంది. శాటిలైట్‌ పరంగా కూడా ఆయన చిత్రాలకు మంచి ఆధరణ ఉంటోంది. ఇందులో బ్రూస్‌లీకి తీవ్ర అభిమానిగా రామ్‌చరణ్‌ నటించారు. ఇందులో ఐదు పోరాట సన్నివేశాలు, ఐదు పాటలు ఉన్నాయి. తమన్‌ బాణీలు తమిళులను కూడా ఆకట్టుకునేలా ఉంటాయన్నారు.

  అనంతరం నిర్మాత భద్రకాళి ప్రసాద్‌ మాట్లాడుతూ... 1986లో చిరంజీవి నటించిన ఓ సినిమాను తమిళంలో అనువాదం చేసి విడుదల చేశా. 30 ఏళ్ల తర్వాత రామ్‌చరణ్‌ సినిమాను కూడా తమిళంలోకి తీసుకెళ్లా. ఇప్పుడు తాజాగా 'బ్రూస్‌లీ 2'ను విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. అప్పుడు చిరంజీవి సినిమా, ఇప్పుడు ఆయన కుమారుడి సినిమాలను వరుసగా తెరపైకి తీసుకురావడం సంతోషమైన విషయం. రెండు తరాలతో నా నిర్మాణ పయనం సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

  ‘బ్రూస్ లీ విశేషాలకు వస్తే...

  About RamCharan's Bruslee tamil release

  రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ది ఫైటర్‌' అనేది ట్యాగ్ లైన్. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో వచ్చే నెల 2న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం ఆడియో రైట్స్ ని జీ మ్యూజిక్ వారు తీసుకున్నట్లు సమాచారం. మరో ప్రక్క ఈ ఆడియో పంక్షన్ ని సింపుల్ గా లాగించేయాలని హీరో,దర్శకుడు నిర్ణయించినట్లు సినివర్గాల సమాచారం. అలాగే చిరంజీవి తప్ప మరెవరూ స్పెషల్ గెస్ట్ లుగా ఇన్వైట్ చేయలేదని చెప్తున్నారు.

  చిత్రం విశేషాల్లోకి వెళితే..

  చిరంజీవి ఓ కీలక పాత్రలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో నృత్య దర్శకుడు శేఖర్‌ నేతృత్వంలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. మెగా మీటర్‌... అంటూ సాగే ఆ పాటలో చరణ్‌, రకుల్‌ ఆడిపాడుతున్నారు. త్వరలో చిరంజీవి కూడా చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు.

  నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. పాటల్ని వచ్చే నెల 2న, చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

  About RamCharan's Bruslee tamil release

  చిరంజీవి గెస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ...56.45 కోట్ల వరకూ జరగటంతో ట్రేడ్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. నిర్మాతకు టేబుల్ ఫ్రాఫిట్స్ తెచ్చిపెడుతున్న ఈ చిత్రం.

  ఈ చిత్రంలో చిరంజీవి 15 నిముషాల పాటు కనిపించనున్నారు.. రామ్ చరణ్, చిరంజీవి లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను కొద్ది రోజుల పాటు తీస్తారు. చిరంజీవి చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి ఈ చిత్రంలో చేయబోయే సీన్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.

  లారెన్స్ స్టైల్ సినిమాలో చేసినట్లుగానే చిరంజీవి ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ ముందు ఓ కష్టం నుంచి బయిటపడేస్తారు. రకుల్ ప్రీతి ని విలన్స్ నుంచి కాపాడటానికి చిరంజీవి హెల్ప్ చేస్తారు. రామ్ చరణ్ వంటి హీరోకి హెల్ప్ చేయగలవారు ఎవరా అని ఆలోచించి చిరంజీవి అయితేనే బెస్ట్ అని ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవితలో లాగానే మెగాస్టార్ చిరంజీవి గా సినిమా హీరోగా కనిపిస్తారు. అయితే ఇదంతా నిజమా కాదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాల్సిందే.

  "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

  ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

  English summary
  Bhadrakali films has acquired rights of tamil and malayalam version of Mega power star ram charan's "Bruce Lee 2"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X