»   » హీరో అజిత్-శాలిని.....వారసుడి పేరు ఇదే!

హీరో అజిత్-శాలిని.....వారసుడి పేరు ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్, షాలిని దంపతులకు ఇటీవల మగ బిడ్డకు జన్మనించిన సంగతి తెలిసిందే. వీరికి 7 సంవత్సరాల వయసున్న పాప అనౌష్క ఉండగా, మార్చి 2న బాబు జన్మించాడు. బాబుకు ఏం పేరు పెడతారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడికి ‘ఆద్విక్' అని పేరు పెట్టినట్లు అజిత్-శాలినిలు ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘ఆద్విక్' అంటే అపూర్వమైనది(unique) అని అర్థం.

అజిత్, శాలిని మతాంతర వివాహం చేసుకున్నారు. అజిత్ కుమార్ హిందూ అయితే, శాలిని క్రిస్టియన్. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా శాలిని తను కమిటైన రెండు ప్రాజెక్టులను పూర్తి చేసారు. ఆ తర్వాత సినిమాకు గుడ్ బై చెప్పారు. వీరికి 2008 జనవరి 8వ తేదీన పాప జన్మించింది. తమ కూతురుకి అనౌష్క అనే పేరు పెట్టుకున్నారు.

Actor Ajith's son named Aadvik

అజిత్ సినిమాల విషయానికొస్తే...అజిత్, అనుష్క, త్రిష ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ఎంతవాడు గాని'. రీసెంట్గా తమిళంలో విడుదలైన ఈ చిత్రం(ఎన్నై ఆరిందాల్) మంచి విజయాన్ని నమోదు చేసింది. తెలుగులోనూ ఈచిత్రాన్ని విడుదల చేబోతున్నారు. ఏప్రిల్ 23న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో విడుదల చేసారు.

అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. వెంకటేష్ ‘ఘర్షణ', కమల్ హాసన్ ‘రాఘవన్' చిత్రాల తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మరో పోలీస్ ఆఫీసర్ స్టొరీ ఇది. అజిత్, అనుష్క, త్రిషల నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి.

English summary
Fans of actor Ajith Kumar are happy about his personal front - his wife, actress Shalini gave birth to a boy recently. The latest update is that the boy has been named Aadvik. He will be henceforth referred to as Aadvik Ajithkumar, said a press release.
Please Wait while comments are loading...