»   »  ప్రేమ వివాహం చేసుకున్న ‘ప్రేమిస్తే’ హీరో(ఫోటోలు)

ప్రేమ వివాహం చేసుకున్న ‘ప్రేమిస్తే’ హీరో(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'ప్రేమిస్తే' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తమిళ హీరో భరత్ ఓ ఇంటివాడయ్యాడు. జెస్పీ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మంగళవారం వీరి వివాహం చైన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో బంధువులు, సన్నిహితుల సమక్షంలో ప్రైవేటు కార్యకమంలా జరిగింది.

తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భరత్, క్రైస్తవ మతస్తురాలైన జెస్సీని పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భరత్, జెస్సీ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. జెస్సీ దుబాయ్‌లో దంతవైద్యురాలు.

పెళ్లి సాదాసీదాగా జరిగినప్పటికీ....వివాహ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన చెన్నైలోని లీలా మహల్‌లో రిసెప్షన్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు, భరత్ స్నేహితులు, సన్నిహితులు హాజరు కానున్నారు.

స్లైడ్ షోలో భరత్, జెస్సీ పెళ్లికి ముందు తీసుకున్న ఫోటోలు...

రిలీ లైఫ్‌ను తలపించే రియల్ లైఫ్

రిలీ లైఫ్‌ను తలపించే రియల్ లైఫ్


సినిమాల్లో ప్రేమ వివాహాలు, మతాంతర, కులాంతర వివాహాలు మనం చూస్తూనే ఉన్నాం. భరత్ వివాహం కూడా అదే విధంగా జరుగడం చర్చనీయాంశం అయింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లోనూ మతాంతర వివాహం చేసుకుని ఆదర్శవంతంగా నిలిచాడు భరత్.

పరిచయం ఎలా అంటే..

పరిచయం ఎలా అంటే..


ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా భరత్, జెస్సీ మధ్య పరిచయం ఏర్పడింది. జెస్సీ దుబాయ్‌లో డెండిస్టుగా పని చేస్తోంది. వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత కొంత కాలంగా డేటింగ్ కూడా చేసారు.

పెధ్దలను ఒప్పించి పెళ్లి

పెధ్దలను ఒప్పించి పెళ్లి


మతాంతర వివాహం అయినా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు భరత్, జెస్సీ. భరత్ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు కాగా, జెస్సీ క్రైస్తవ మత కుటంబానికి చెందిన అమ్మాయి.

పెళ్లి, రిసెప్షన్

పెళ్లి, రిసెప్షన్


మంగళవారం(సెప్టెంబర్ 10)న వీరి వివాహం చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. అయితే కేవలం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 14న చెన్నైలోని లీలా మహల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరుగనుంది.

English summary

 Actor Bharath got married to Dubai based Dr. Jesslie on the 10th of September 2013 and their reception ceremony would be held on the 14th of September in Chennai's Leela Palace Hotel from around 5 pm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu