»   » ప్రౌడ్ మూమెంట్: ఇండియాకి పతకం సాధించి పెట్టిన మాధవన్ కొడుకు!

ప్రౌడ్ మూమెంట్: ఇండియాకి పతకం సాధించి పెట్టిన మాధవన్ కొడుకు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు మాధవ్ కుమారుడు వేదాంత్ మాధవన్ ఇండియాకి తన తొలి అంతర్జాతీయ పతకం సాధించి పెట్టాడు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఏజ్ గ్రూఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ 2018లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 1500 మీటర్ల ప్రీ స్టైల్ విభాగంలో వేదాంత్ ఈ మెడల్ గెలుపొందారు.

తన కుమారుడు ఇండియా తరుపున తొలి అంతర్జాతీయ పతకం సాధించిన విషయాన్ని మాధవన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''సరితా, నేను తల్లిదండ్రులుగా గర్వపడే సందర్భం ఇది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో వేదాంత్ తొలి పతకం సాధించాడు.'' అని మాధవన్ పేర్కొన్నారు.

మాధవన్ కుమారుడు అంతర్జాతీయ పతకం సాధించడంపై అభిమానుల నుండి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. పలువురు అభిమానులు, యాక్టర్లు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వేదాంత్ భవిష్యత్తులో ఇలాంటి పతకాలు మరిన్ని దేశానికి సాధించి పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

సరిత-మాధవన్ దంపతులకు వేదాంత్ 2005 ఆగస్టులో జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 12 సంవత్సరాలు. చిన్నతనం నుండి వేదాంత్ స్మిమ్మింగ్ మీద ఆసక్తి చూపడంతో ఆదిశగా తల్లిదండ్రులిద్దరూ ఎంకరేజ్ చేశారు. వారి ప్రోత్సాహమే అంతర్జాతీయ స్థాయిలో అతడు పతకాలు సాధించేలా చేసింది.

మాధనవ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'సవ్యసాచి' చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. దీంతో పాటు ఆండ్రగ అనే సినిమా చేయబోతున్నాడు.

English summary
Actor Madhavan's son Vedaant Madhavan has apparently won his first International medal for India. He got a Bronze at Thailand Age Group Swimming Championships 2018."Proud moment for Sarita and I as Vedaant wins his first medal for India in an international swim meet in Thailand today. Thank you for all your blessings." Madhavan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X