»   » హీరోయిన్‌ దివ్యను పెళ్లాడబోతున్న నిర్మాత ఆర్.కె. సురేష్

హీరోయిన్‌ దివ్యను పెళ్లాడబోతున్న నిర్మాత ఆర్.కె. సురేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ నటుడు, నిర్మాత ఆర్.కె. సురేష్ చెన్నైలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన పెళ్లి విషయం ప్రకటించారు. ఈ సందర్భంగా నటి దివ్యను మీడియాకు పరిచయం చేయడంతో పాటు త్వరలో ఆమెను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

తమది అరేంజ్డ్ మ్యారేజ్ అని, దివ్య తన సొంతూరైన రామనాథపురంకు చెందిన వ్యక్తి అని, తనకు ఎంతో నచ్చిందని ఆర్.కె. సురేష్ వెల్లడించారు. ఇటీవలే తమ నిశ్చితార్థం జరిగిందని, నవంబర్ మాసంలో పెళ్లి ముహూర్తం పెట్టుకునన్నట్లు తెలిపారు.

ఆర్.కె సురేష్

ఆర్.కె సురేష్

సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆర్.కె.సురేష్ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు నిర్మించారు. అనంతరం తారై తప్పటై సినిమా ద్వారా నటుడిగా మారారు.

దివ్య

దివ్య

తమిళ సీరియల్ సుమంగళిలో హీరోయిన్ దివ్య పాపులర్ అయింది. దీంతో పాటు లక్ష్మీ వందాచ్చి అనే సీరియల్ లో నటించింది. తర్వాత కొన్ని సినిమాలు కూడా చేసింది.

పెళ్లి తర్వాత నటనకు దూరం

సురేష్ తో వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రెస్ మీట్లో దివ్య ప్రకటించారు. ఆ తర్వాత ఇంటి బాధ్యతలతో పాటు సురేష్‌కు సంబంధించిన బాధ్యతలు చూసుకోనున్నట్లు తెలిపారు.

వరుస సినిమాలు

వరుస సినిమాలు

ప్రస్తుతం ఆర్.కె. సురేష్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పడై వెల్లుమ్, హర హర మహదేవకి, థాని ముగమ్, బిల్లా పాండి, స్కెచ్, కాకా, వెట్టై నాయ్ సినిమాల్లో నటిస్తున్నారు.

English summary
Producer RK Suresh who was seen playing important roles in Tharai Thappatai and Marudhu met the press to announce his wedding and introduced his better half actress Divya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu