»   » ఆ బిజినెస్ లో ...హీరో సూర్య పెట్టుబడి

ఆ బిజినెస్ లో ...హీరో సూర్య పెట్టుబడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఎక్కడ రూపాయి వస్తుంది అంటే అక్కడ హీరోలు వాలుతూంటారు. అదీ సినిమాలకు సంభందించిన బిజినెస్ అయితే మరింత ఉత్సాహం. ముఖ్యంగా తమిళ హీరో సూర్య ఇలా బిజినెస్ వ్యవహారాల్లో ఉత్సాహం చూపిస్తూంటారు. తాజాగా ఆయన ఆన్ లైన్ బిజనెస్ ‘హీరో టాకీస్‌' లో పార్టనర్ గా చేరారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళ సినిమాలను అధికారికంగా కొనుగోలు చేసి తన ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా విడుదల చేస్తోంది ‘హీరో టాకీస్‌'. విదేశాల్లో ఈ వెబ్‌సైట్‌కు ఆదరణ ఎక్కువ. ఇప్పటి వరకు 30వేల మంది యూజర్లు ఉన్నారు. 7,500 మంది సబ్‌స్క్రైబ్‌ అయ్యారు. మొత్తం 55 దేశాల్లో ఈ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ తన సేవలను అందిస్తోంది.

Actor Suriya invest in Online Movie Business

ఇటీవల విడుదలైన ‘బాహుబలి', ‘వేదాలం', ‘ఉప్పుకరువాడు'తో పాటు పలు చిత్రాలను ఈ సంస్థ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. సినిమా విడుదలైన రెండు నుంచి ఐదు వారాల తర్వాత ఆన్‌లైన్‌లోకి తెస్తోంది. ఈ సంస్థలో నటుడు సూర్య కూడా భాగస్వామిగా మారారు.

అలాగే సూర్య ఇటీవల ‘2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌'ను ఆరంభించిన విషయం తెలిసిందే. ఆరంభంలో డిస్ట్రిబ్యూషన్‌ మాత్రమే చేసేవారు. ఆ తర్వాత సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇటీవల తన భార్య జ్యోతిక నటించిన ‘36 వయదినిలే'కు ఆయనే నిర్మాత. పాండిరాజ్‌ దర్శకత్వంలో ‘పసంగ 2'ను కూడా రూపొందించారు.

విక్రం కె.కుమార్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘24'ను కూడా నిర్మిస్తున్నారు. ‘హీరో టాకీస్‌'లో కూడా 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామిగా మారింది. ‘ఓ ముందుచూపులో భాగంగా పలు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సినీ వినోద విభాగంలో అభివృద్ధి గడించేలా అందులో పెట్టుబడి పెట్టాము'అని సంస్థ నిర్వాహక అధికారి రాజశేఖర్‌ తెలిపారు.

English summary
HeroTalkies.com has raised its first round of investment from actor-producer Suriya's 2D Entertainment. Suriya sees this as a strategic investment into the online movie streaming business.
Please Wait while comments are loading...