»   » నాతో జేబులు కొట్టించారు, నేర్పించారు కూడా: సినిమా కోసం హీరోయిన్ కి ఎన్ని తిప్పలో

నాతో జేబులు కొట్టించారు, నేర్పించారు కూడా: సినిమా కోసం హీరోయిన్ కి ఎన్ని తిప్పలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ఞు చిత్రంలో కథానాయికగా నటించిన అను ఇమ్మాన్యుయల్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళుతుంది. మలయాళం, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ నటిస్తున్న నటి అనుఇమ్మానుయేల్‌. కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం తుప్పరివాలన్‌. విశాల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్‌ దర్శకుడు.

నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి అనుఆమ్మానుయేల్‌ తెలుపుతూ మిష్కన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని చెప్పగానే చాలామంది భయపెట్టారట. ఆయన షార్ట్‌టెంపర్‌ అంటూ భయపెట్టారు అని చెప్పింది. అయితే మిష్కిన్‌ దర్శకత్వంలో నటిస్తున్నప్పుడు ఆయన గురించి అందరూ ఎందుకలా అనుకుంటున్నారో తనకు మాత్రం అర్థం కాలేదు.

Actress Anu Emmanuel learn the art of pick pocketing

ఈ సినిమాకి పని చేస్తూ మిష్కిన్ దగ్గర చాలానే నేర్చుకుందట. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తాను చేసిన దొంగతనాల గురించే. కథలో పాత్ర ప్రకారం అనూ ఒక పిక్ పాకెటర్ కావటం తో జేబులు కొట్టటం లో మెలకువలు నేర్చుకుందట అనూ ఇమ్మాన్యుయేల్. తుప్పరివాలన్ సినిమాను.. వెరైటీగా పబ్లిక్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు విశాల్.

ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా నడిచే కథతో రూపొందడంతో.. సినిమాలో ఫైటింగ్ సీన్లకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. అనుకున్న ప్రకారంగానే.. దర్శకుడు మిష్కిన్.. పోరాట సన్నివేశాలను కూడా కాస్త కొత్తగా చిత్రీకరించే ప్రయత్నం చేశారట. ప్రయివేట్ డిటెక్టివ్ ల లైఫ్ స్టయిల్ తో ఉండే తుప్పరివాలన్ సినిమాలో.. యాక్షన్ సీక్వెన్స్ లే హైలైట్ కూడా కాబోతున్నాయట.

Pawan Kalyan and Trivikram Film Satellite Rights Got Record Price

ఇంతటి ప్రాధాన్యత ఉండడంతో.. ముందుగా యాక్షన్ దృశ్యాలనే జనంలోకి తీసుకువెళ్లాలని.. హీరో విశాల్ భావిస్తున్నాడు. అందుకే.. త్వరలోనే తుప్పరివాలన్ పోరాట దృశ్యాలను ఆవిష్కరించాలని కూడా ప్లాన్ చేస్తున్నాడు. మరో వారంలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న తుప్పరివాలన్.. ఇలా వార్తల్లో నిలవడం మొదలైపోయింది.

English summary
"I had to learn the art of pick-pocketing -like how to steal easily and gracefully" .said Actress Anu Emmanuel
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu