ఐదేళ్లు సహజీవనం.. గర్బవతిని చేసి ముఖం చాటేశాడు.. మాజీ మంత్రిపై హీరోయిన్ చాందిని సంచలన ఆరోపణలు

సినీ తారలకు, రాజకీయ నేతలకు సంబంధాలు ఉండటం అత్యంత సహజం. రాజకీయ నేతలు సినీతారలను పెళ్లాడటం, సినీ యాక్టర్లు పొలిటిషన్స్ పెళ్లాడటం సాధారణంగా మారాయి. అయితే తాజాగా ఓ రాజకీయ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి తనను మోసగించారనే విషయాన్ని సినీ నటి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేయడం దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే...

తమిళ నేతతో హీరోయిన్ చాందినికి లింకు

తమిళ నేతతో హీరోయిన్ చాందినికి లింకు


తమిళ సినీ రంగంలో యువ హీరోయిన్ చాందినీ వర్థమాన తారగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకొంటున్నారు. సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ యువ హీరోయిన్‌‌కు రాజకీయ నాయకుడితో పరిచయం ఏర్పడింది. తమిళనాడులోని ఏఐడీఎంకే ఎమ్మెల్యే, మంత్రి మణికందన్‌తో పరిచయం సహజీవనం వరకు వెళ్లింది.

ఐదేళ్లు సహజీవనంతో ఎంజాయ్

ఐదేళ్లు సహజీవనంతో ఎంజాయ్


మంత్రి మణికందన్‌తో సహజీవనం రంజుగా సాగింది. ఐదేళ్లపాటు వారిద్దరూ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేశారు. అయితే పెళ్లి వరకు రాగానే చాందినిని మంత్రి దూరంగా పెట్టడంతో వారి బంధం బాహ్య ప్రపంచానికి తెలిసింది. మంత్రి మణికందన్ తనను మోసగించాడంటూ ఆరోపణలు చేయడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

గర్బవతిని చేసి మోసం చేశాడని...

గర్బవతిని చేసి మోసం చేశాడని...


ఇటీవల మంత్రి మణికందన్‌పై హీరోయిన్ చాందిని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మండిపాటుకు గురైంది. తనతో ఐదేళ్లు సహజీవనం చేసి నన్ను గర్బవతిని చేశారు. బలవంతంగా గర్బస్రావానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నా నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. కిరాయి గూండాలను నియమించి నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి..

ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసి..

తన జీవితాన్ని నాశనం చేసిన మంత్రి మణికందన్‌ బెదిరింపులకు బయపడేది లేదు అంటూ ఘాటుగా హీరోయిన్ చాందిని సమాధానం ఇచ్చింది. వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసింది. అంతేకాకుండా తనకు న్యాయం జరిగేంత వరకు మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేసింది.

ప్రాణాలకు ముప్పు ఉంది...

ప్రాణాలకు ముప్పు ఉంది...


అంతేకాకుండా మంత్రి మణికందన్‌పై పోలీసులకు హీరోయిన్ చాందిని ఫిర్యాదు చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉంది. తనకు న్యాయం చేయాలి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ సహజీవనానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. తనను బెదిరించినట్టుగా కొన్ని సాక్షాలను పోలీసులకు అందించిందనే విషయం మీడియా కథనాల్లో స్పష్టమైంది.

సీఎంకు వ్యతిరేకంగా.. మంత్రి పదవి ఫట్

సీఎంకు వ్యతిరేకంగా.. మంత్రి పదవి ఫట్


ఇక మంత్రి మణికందన్ విషయానికి వస్తే....అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీటీవీ దినకరన్ గ్రూపులో చేరిన రెబెల్‌గా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యతిరేక కూటమిలో చేరడం వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయారు.

Recommended Video

Bombhaat Director About Chandini Chowdary | Bombhaat Team Interview Part 4
హీరోయిన్ చాందినీ కెరీర్ ఇలా

హీరోయిన్ చాందినీ కెరీర్ ఇలా

ఇక హీరోయిన్ చాందిని వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి వస్తే.. ఆమె మలేషియాలో జన్మించారు. సినిమాలపై మోజుతో ఆమె చెన్నైలో అడుగుపెట్టారు. నాడోదిగల్ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ప్రస్తుతం పబ్జీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా మంత్రిపై ఆరోపణలతో హీరోయిన్ చాందిని సెన్సేషనల్‌గా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X