»   » అమ్మ కష్టంలో ఉన్నపుడు ఎవరూ రాలేదు: విజయశాంతి

అమ్మ కష్టంలో ఉన్నపుడు ఎవరూ రాలేదు: విజయశాంతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా, తర్వాత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి....2014 ఎన్నికల తర్వాత వార్తల్లో కనిపించడమే లేదు. చాలా కాలం తర్వాత విజయశాంతి మీడియా కంట పడ్డారు.

దివంగత తమిళనాడు ముఖ్య‌మంత్రి జయలలిత సమాధిని దర్శించుకోవడానికి ఇటీవ‌ల విజయశాంతి చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా ఆమె మీడియాతో మాట్లాడుతూ జయలలితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Vijayashanthi

ఈ క్రమంలో జయలలిత మరణంపై నటి గౌతమి చేసిన ఆరోపణలపై మీడియా వారు ఆమెను కదిలించగా....ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవ‌రు కూడా అమ్మ క‌ష్టంలో ఉన్న‌ప్పుడు రాలేదు, క‌ష్టంలో ఉన్న‌ప్పుడు నిలిచిన‌వాళ్లే నిజ‌మైన ఆప్తులు అంటాం. నాకు తెలిసి వీళ్లు ఎవ‌రూ ఆమె కోసం రాలేదు . జైలుకి వెళ్లిన‌ప్పుడు, బాధ‌లో ఉన్న‌ప్పుడు రాలేదు. అలాంటి వారు ఇపుడు కొత్త‌గా మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

హాస్పటల్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారికి సెక్యూరిటీ కూడా భారీగా ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా కుట్ర జరిగిందని అనడం సరికాదు అన్నారు.

English summary
Actress Vijayashanthi paid homage to Jayalalitha at Marina Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu