For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రేజీ డైరక్టర్ తో విశాల్‌ నెక్ట్స్

  By Srikanya
  |

  చెన్నై: ఓ దర్శకుడుకు క్రేజ్ వచ్చిదంటే హీరోలందరి దృష్టీ ఆ దర్శకుడుపైనే ఉంటుంది. ప్రస్తుతం తమిళంలో యువ దర్శకుల్లో ప్రతిభ చూపుతున్నవారు దురైసెంథిల్‌ కుమార్‌. ఎలాంటి అంచనాలు లేకుండా శివకార్తికేయన్‌తో 'ఎదిర్‌నీచ్చల్‌' రూపొందించి.. కమర్షియల్‌ పరంగా అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాంతో హీరోలంతా ఈ దర్శకుడుతో చిత్రం చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందరికన్నా ఓ అడుగు ముందుకు వేసి విశాల్... ఈ దర్శకుడుని తన తదుపరి చిత్రానికి ఖరారు చేసుకున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  మళ్లీ శివకార్తికేయన్‌తోనే 'కాక్కిసట్త్టె'ని రూపొందిస్తున్నారు ఆయన. ఈ సినిమాకు ఈ నెల 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సాధారణ హీరోగా ఉన్న శివకార్తికేయన్‌ తొలిసారిగా పోలీసు అధికారిగా మారారు.

  పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌తోపాటు, శివ శైలి, హాస్యం కూడా ఆ పాత్రకు జతచేశారు. 'ఎదిర్‌నీచ్చల్‌' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.

  After Kaaki Sattai, Vishal to take on the lead ?

  ఇదిలా ఉండగా దురైసెంథిల్‌ కుమార్‌ ఇటీవల విశాల్‌కు కూడా ఓ కథ వినిపించినట్లు సమాచారం. ఆ కథ విశాల్‌కు నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. ఫైవ్‌స్టార్‌ కదిరేశన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది.

  విశాల్ తాజా చిత్రం ఒకటి రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ చిత్రం విషయానికి వస్తే..

  హీరోగా నటిస్తూ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మగ మహారాజు'. సుందర్‌ సి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, మధురిమ, మాధవీలత నాయికలు. వైభవ్‌ ఓ కీలక పాత్ర పోషించారు. విశాల్‌ మేనత్తలుగా రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌ నటించారు. తమిళంలో రూపొందిన ‘ఆంబల'కు ఇది తెలుగు రూపం. ఈ చిత్రంతో ‘హిప్‌హాప్‌ తమిళ' సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. రమ్యకృష్ణ, విశాల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అంటున్నారు.

  సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విశాల్ కు అత్తగా నటించారు. వీరిద్దరూ కలిసి ఒక పాటలో సందడి చేయనున్నారు. మరో ఇద్దరు మాజీ హీరోయిన్లు ఐశ్వర్య, కిరణ్ లు సైతం విశాల్ కి అత్తలుగా నటించారు. మధురిమ, మాధవి లత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

  హీరో రానా మాట్లాడుతూ... ట్రైలర్‌లో విశాల్ చాలా బాగున్నాడు. అతని చుట్టు ముగ్గురు హీరోయిన్‌లున్నారు....ఇదంతా చూసిన తరువాత సినిమాకు కావాల్సినవి అన్నీ వున్నాయన్న భావన కలిగింది. చిత్రపరిశ్రమలో వున్న హీరోల్లో వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చిన వ్యక్తి విశాల్. చూడటానికి గంభీరంగా కనిపించినా అతని మనసు మాత్రం వెన్న. విశాల్ నటించి నిర్మించిన ఈ సినిమా తమిళంలో కన్నా తెలుగులో మంచి విజయాన్ని సాధించాలి అన్నారు.

  విశాల్ మాట్లాడుతూ... నిర్మాతగా నా 4వ చిత్రమిది. తమిళంలో సంక్రాంతికి విడుదల చేస్తున్నాం. తెలుగులో ఇంకా తేదీ నిర్ణయించలేదు. ఈ సినిమాతో హిప్‌అప్ తమిళ ఆదిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. పాటల కంపోజింగ్ కోసం ఏ దేశమో వెళ్లకుండా కేవలం 2500 రూపాయల ఖర్చుతో చెన్నైలోనే చేశాం. ఇప్పటికే తమిళంలో పెద్ద హిట్ అయింది.

  తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందు నా చిత్రాలని ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సినిమా కోసం మస్కట్‌లో ఓ పాట చేశాం. దీని కోసం ఎనిమిది కిలోమీటర్‌లు యూనిట్ అంతా నడిచివెళ్లడం జరిగింది. ఈ పాట కోసం హన్సిక చాలా సహకరించింది. సినిమాలో ఈ పాట హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో నటించడం ఆనందంగా వుందని వైభవ్ తెలిపారు.

  హన్సిక మాట్లాడుతూ- సుందర్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. మంచి పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలుస్తుంది అన్నారు.

  English summary
  Producer Kathiresan of Group Company is now set to bring together Vishal and director Durai Senthilkumar of Kaaki Sattai fame.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X