»   » ‘ఏజెంట్ భైరవ’గా వస్తున్న హీరో విజయ్ (ట్రైలర్)

‘ఏజెంట్ భైరవ’గా వస్తున్న హీరో విజయ్ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్‌ భైరవ'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'తమిళ్‌స్టార్‌ హీరో, ఇళయదళపతి విజయ్‌ పుట్టినరోజు జూన్‌ 22.


ఈ సందర్భంగా విజయ్‌ నటించిన 'ఏజంట్‌ భైరవ' టీజర్‌ ను విడుదల చేశాము. ఈ చిత్రం మా హీరో విజయ్‌కి తెలుగులో మంచి మైలురాయిగా నిలుస్తుంది. ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌, కీర్తిసురేష్‌ల నటన అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్‌. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ని ఈచిత్రం సొంతం చేసుకుంది. చిత్రాన్ని జూలై ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..' అన్నారు.


విజయ్‌, కీర్తిసురేష్‌, జగపతిబాబు, సతీష్‌, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కెమెరా: ఎమ్‌. సుకుమార్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, ఆర్ట్‌: ఎమ్‌. ప్రభాకరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌. కె. ఎల్‌, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ-దర్శకత్వం: భరతన్‌.


English summary
Agent Bhairava Telugu Movie Official Theatrical Trailer. #AgentBhirava Movie Stars Vijay, Keerthy Suresh, Jagapati Babu. Produced By Bellamkonda Rama Krishna Reddy, Music By Santosh Narayan, Directed by Bharathan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu