»   » లో బడ్జెట్ చిత్రం లో అతిథి పాత్రలో సూపర్ స్టార్

లో బడ్జెట్ చిత్రం లో అతిథి పాత్రలో సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : సూపర్ స్టార్ ఓ చిన్న బడ్జెట్ చిత్రంలో గెస్ట్ రోల్ లో యాక్ట్ చేస్తే ఆ చిత్రం చక్కగా ఒడ్డున పడుతుంది. బిజినెస్ పరంగానూ ఆ చిత్రంకు క్రేజ్ వస్తుంది. వివరాల్లోకి వెళితే 'ఆరంభం'కు ముందు అజిత్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం గాంబ్లర్ ('మంగాత్తా'). అజిత్‌ను ఓ కొత్త కోణంలో చూపిన ఈ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకుడు. నెరసిన వెంట్రుకలతోనే అజిత్‌ను గ్లామరస్‌గా చూపించిన వెంకట్‌ప్రభు.. ఆరంభం, వీరం చిత్రాల్లోనూ అజిత్‌ అదే ఆహార్యాన్ని కొనసాగించటానికి కారకుడయ్యాడు.

మూడేళ్ల కిందట వచ్చిన మంగాత్తా బాక్సాఫీసు వద్ద భారీగానే సందడి చేసి వీరి కాంబినేషన్‌కు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే అందాల నటుడు అజిత్‌ మరోసారి వెంకట్‌ప్రభు చిత్రంలో కనిపించనున్నాడట. అయితే హీరోగా మాత్రం కాదట. ప్రస్తుతం కొత్త నటీనటులతో ఓ లోబడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు వెంకట్‌ప్రభు. ఇందులో అతిథి పాత్రలో అజిత్‌ నటిస్తే బాగుంటుందని భావించిన ఆయన విషయాన్ని అజిత్‌కు తెలిపాడట. తనకు బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు, అంతకు మించి సన్నిహితుడైన వెంకట్‌ప్రభు చిత్రంలో నటించేందకు వెంటనే అంగీకరించాడట అజిత్‌.

ఇక అజిత్‌ హీరోగా నయనతార కాంబినేషన్ లో విష్ణువర్దన్‌ దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'ఆరంభం' కురిపించిన కాసుల వాన.. మరోమారు కోలీవుడ్‌ సత్తాను చాటింది. విడుదలైన పదిహేను రోజుల్లోనే రూ.113 కోట్లకు పైగా రాబట్టిందని కోలీవుడ్‌ వర్గాల అనధికార సమాచారం. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో చండి నిర్మాత శ్రీనుబాబు...కి 3.75 కోట్లుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం డిస్ట్ర్రిబ్యూషన్ సైడ్ కూడా మంచి డిమాండ్ వచ్చిందని చెప్తున్నారు. శాటిలైట్ రైట్స్ నిమిత్తం రెండు కోట్లు,నైజాం ఏరియాకు 1.25 కి అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఐదు కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

కథలో అశోక్(అజిత్),మాయ(నయనతార),అర్జున్(ఆర్య)కలిసి ఓ మిషన్ పై పనిచేస్తూంటారు. అర్జున్ ఓ కంప్యూటర్ హ్యాకర్. హై సెక్యులర్ సిస్టమ్స్ వారు హాక్ చేస్తూంటారు. ఆర్య గర్ల్ ప్రెండ్ అనిత(తాప్సి) ఓ జర్నలిస్ట్. ఆమె కూడా ఈ డ్రామా లో ఉపయోగపడుతుంది. అశోక్ ఓ లా బ్రేకర్ గా కనిపిస్తాడు. అయితే అసలు అశోక్ అలా ఎందుకు మారి...ఇతర సిస్టమ్స్ ని హ్యాక్ చేయాల్సి వచ్చింది అనేది సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్(రానా) పూర్ క్వాలిటీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ వాడటం వల్ల మరణిస్తాడు. సంజయ్ ...అశోక్ కి క్లోజ్ ప్రెండ్. తన స్నేహితుడు మరణానికి కారణమైన క్రిమినల్స్ పని పట్టడానికి ఇలా అశోక్..లా బ్రేకర్ గా మారి... యుద్దం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ ...అతను ఈ విషయంలో సక్సెస్ అయ్యాడా... కథలో మెయిన్ ట్విస్ట్ ఏమిటి అనేది మిగతా కథ.

English summary

 Venkat Prabhu directing a low budget film with New faces. Ajith will be doing a guest role for this next film. 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu