»   »  శభాష్ : తెర మీదే కాదు...తెర వెనకా హీరోనే

శభాష్ : తెర మీదే కాదు...తెర వెనకా హీరోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : చాలా మంది హీరోలు తెరపైమీద కనిపించేటంత ఉదాత్తంగా నిజ జీవితంలో ఉండరు..అలాగే విలన్ వేస్తూ క్రూరులుగా కనిపించే వారు నిజ జీవితంలోనూ సౌమ్యంగా ఉంటూంటారు. అయితే తెర మీద, తెర వెనక హీరోగానే జనాల హృదయాల్లో నిలిచిపోయేవారు అరుదు. అలాంటి వారిలో అజిత్ ఒకరు. తను ఒక్కడే బాగుంటే చాలు అనుకోకుండా, తన వద్ద పనిచేసే వారి సంక్షేమం కూడా బాగుండాలి అని కోరుకుంటాడు. అజిత్ ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది నిజం.

వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ హీరో అని అందరితోనూ మెప్పు పొందుతున్నారు అజిత్‌. అవును.. ఎలాంటి ప్రచార ఆర్భాటాలూ లేకుండా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవటం అజిత్‌ అలవాటు. ఇదిలా ఉంటే తోటమాలి, కారు డ్రైవర్‌, వంట మనిషి... ఇలా తన వద్ద పని చేసేవారికి ఇళ్లు కట్టించాలని నిర్ణయించారాయన.

 Ajith to gift homes for his house staffs

ఇందుకోసం పాత మహాబలిపురం రోడ్డులో కొంత స్థలాన్ని కూడా కొన్నారు. మనిషికి అర ఎకరం చొప్పున పదిమందికి వారి పేరిటే రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేశారు. కొన్ని నెలలుగా కొనసాగిన పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. గృహ ప్రవేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు అజిత్‌. ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కోసం మలేషియాలో ఉన్నారు. త్వరలోనే ఆయన చెన్నైకు రానున్న నేపథ్యంలో గృహ ప్రవేశం జరగనుంది.

తన చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే హీరో అజిత్‌. 'ఆరంభం', 'వీరం' వంటి వరుస హిట్లతో ఆయన స్థాయి మరింత పెరిగింది. దీనికి తోడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తొలిసారిగా నటించనుండటంతో కోలీవుడ్‌లోనే ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి.
అజిత్‌కు జంటగా.. అనుష్క, ఎమీ జాక్సన్‌ ఆడిపాడనున్నారు. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఇందులో అజిత్‌ను సరికొత్త గెటప్‌లో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్‌ హెయిర్‌స్టెల్‌ వినూత్నంగా ఉండనుందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

English summary

 Ajith fondly known as Thala by his fans is known for his simplicity and charity. The latest of the star actor's gracious acts is that he has bought a piece of land to build homes for his house staff.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu