»   »  గెస్ట్ రోల్ కి ఒప్పుకుంటాడా?

గెస్ట్ రోల్ కి ఒప్పుకుంటాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : విజయ్‌, అజిత్‌ అంగీకరిస్తే అందుకనువైన కథ తన వద్ద ఉందని ఏఆర్‌ మురుగదాస్‌ ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడది కార్యరూపంలో పెట్టే పనిలో ఉన్నారట. అసలు విషయానికొస్తే.. విజయ్‌తో 'తుప్పాక్కి' వంటి బ్లాక్‌బస్టర్‌ను రూపొందించిన ఏఆర్‌ మురుగదాస్‌ ప్రస్తుతం 'కత్తి' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీపావళికి విడుదల చేసే యోచనలో ఉన్నారు.

ఇందులో వచ్చే కొన్ని ముఖ్య పాత్రల కోసం బాలీవుడ్‌ తారలను నటింపజేయాలని ఆలోచించిన మురుగదాస్‌ ప్రస్తుతం అజిత్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మరి అజిత్‌ అంగీకరిస్తారా.. అదే జరిగితే ఢీ అంటే ఢీ అంటున్న తల, తలబది అభిమానుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Ajith guest role in Kathi?

'తుప్పాక్కి' తర్వాత విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్‌, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్‌లో పెద్ద సెట్‌ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ని విడుదల చేసారు.

ఈ నేపథ్యంలో షూటింగ్ ముగియడంతో తన యూనిట్‌కు విజయ్‌ విందు ఏర్పాటు చేశారు. విజయ్‌ కూడా వారితో కలిసి భోజనం చేశారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్‌.

English summary
Thala Ajith Going to be a Guest in vijay's Kathi Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu