»   » వదినగా చేస్తున్నా: తమన్నా

వదినగా చేస్తున్నా: తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమన్నా త్వరలో వదిన గా వెండితెరపై కనిపించి అలరించనుంది. అయితే అది తమిళ చిత్రం 'వీరమ్'. అజిత్ హీరో 'వీరమ్' జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో యమ బిజీగా ఉంది తమన్నా. ఇందులో సాధారణ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్నారాయన. పాత్ర పేరు 'వినాయకం' . ఇక తెరవెనుక అజిత్‌ గురించి చెప్పాల్సిందే. చాలా సరదా వ్యక్తి. తాను నవ్వుతూ.. సెట్‌లోని అందర్నీ నవ్వించే వ్యక్తిత్వం. ఆ హాస్య హావభావాలు చూపించామని దర్శకుడు చెప్తున్నారు.

తమన్నా మాట్లాడుతూ-''ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటికీ కచ్చితంగా భిన్నమైన పాత్ర ఇందులో చేస్తున్నాను. ఇందులో నా పేరు మహాలక్ష్మి. అజిత్ భార్య పాత్ర. కథరీత్యా ఈ సినిమాలో నాకు ముగ్గురు మరుదులు ఉంటారు. చెడుమార్గం పట్టిన ఆ ముగ్గుర్నీ సన్మార్గంలోకి తీసుకొస్తా. ఇంతటి మెచ్యూర్డ్ పాత్ర చేయడం నా కెరీర్‌లో ఇదే ప్రథమం. అజిత్ సార్ పాత్ర రెబల్‌గా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి. నా కెరీర్‌లో నేను పనిచేసిన హీరోలందరిలో సీనియర్ అజిత్‌సార్. దాదాపు 20ఏళ్ల కెరీర్ ఆయనది. ఈ సినిమా టైమ్‌లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. వచ్చే ఏడాది మా అందరికీ శుభారంభం ఈ సినిమా''అని చెప్పారు.

Ajith and Tamanna in action-thriller ‘Veeram’

ఇటీవల క్లాస్‌ పాత్రలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్‌.. ఉన్నట్టుండి పల్లెటూరి ఆహార్యంతో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. తెల్ల పంచె, చొక్కాతో చాలాకాలం తర్వాత కనువిందు చేస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే.. అదే నెరసిన జుత్తు, గడ్డంతో నటిస్తున్నాడు. జయాపజయాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. తన చిత్ర ప్రచారానికి కూడా రాకుండానే నటనే తన పనిగా వ్యవహరిస్తుంటాడు 'తల'. 'అనవసర విషయాలతో ప్రేక్షకుల్లో ఆశలు రేకెత్తించడం నాకు ఇష్టం ఉండద'నే ఆయన.. తాజాగా పంచ్‌ డైలాగులూ వద్దనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయాన్ని తన దర్శకుడు శివకి ప్రధాన షరుతుగా పెట్టాడట. ఆయన నటించిన తాజా చిత్రం 'వీరం' సంక్రాంతికి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది.


శివ కథ గురించి చెప్తూ ...అజిత్‌ వద్దకు వెళ్లినప్పుడు... 'గ్రామీణ నేపథ్యంలో కథ తయారుచేయండి. మామ, బామ్మరిది, అన్న, తమ్ముడు.. ఇలా అన్ని కుటుంబ పాత్రలూ అందులో కనిపించాల'ని సూచించారు. 'గుడ్‌ ఫీల్‌' లభించే కుటుంబ కథలో నటించాలనుందని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే 'వీరం' కథ అల్లాను. కథనం కూడా చాలా చక్కగా వచ్చింది. ఇందులో క్త్లెమాక్స్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిభోజనంలా ఉంటుంది. అంటే.. అన్నం, సాంబారు, రసం... అనుకునేరు. నాటుకోడి, చేపల పులుసు వంటి రుచికరమైన విందును ప్రేక్షకులకు అందజేయనున్నాం అన్నారు.

English summary

 For all those waiting for Ajith’s Veeram. Directed by "Siruthai" Siva, Veeram is a mass-entertainer set in a rural backdrop. In the movie, Ajith will be seen romancing Tamannaah for the first time.Yes, the movie has Ajith and Tamannaah as the main leads. It’s been quite a while since the actress has been seen in any Tamil film. Apparently, the actress’ date-diary is full with Telugu and Hindi films, but then too she agreed to be a part of Veeram because of ‘Thala’ Ajith. She was keen to work with the actor and lapped up the film without thinking twice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu