»   »  సంక్రాంతికి 'తల'పడేది ఇద్దరే!

సంక్రాంతికి 'తల'పడేది ఇద్దరే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఈ సంకాంత్రికి కేవలం తల అజిత్‌, ఇలయ తలబది విజయ్‌ మాత్రమే ప్రేక్షకులకు వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన రజనీకాంత్‌ నటించిన 'కోచ్చడయాన్‌' పండగకు విడుదల కాబోదని తాజాగా తేలిపోయింది. 'ఎందిరన్‌' (రోబో) తర్వాత రజనీకాంత్‌ ప్రేక్షకులకు 'రాణా'గా కనిపించాల్సి ఉన్నా.. అనారోగ్యంతో ఆ ప్రాజెక్ట్‌ అటకెక్కటంతో అభిమానుల ఎదురుచూపులన్నీ 'కోచ్చడయాన్‌'(విక్రమ్ సింహా) పైనే కేంద్రీకృతమయ్యాయి.

Ajith vs Vijay in kollywood in Pongal Race

నిర్మాణాంతర పనులు దాదాపు పూర్తి చేసుకున్న 'కోచ్చడయాన్‌'ను రజనీకాంత్‌ పుట్టినరోజైన డిసెంబరు 12న విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. ఆడియో మాత్రమే డిసెంబరులో అని, సంక్రాంతి బరిలో అంటే జనవరి 10న చిత్రం కచ్చితంగా విడుదల అవుతుందని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ సమయానికి కూడా విడుదలయ్యే సూచనలు లేనట్టే . దాంతో చిత్ర విడుదలకు కొత్త తేదీని పరిశీలిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తరఫు వర్గాలు అంటున్నాయి.

రజనీకాంత్‌ చిత్రం రావడం లేదన్న లోటును భర్తీ చేస్తూ ప్రేక్షకులకు పసందైన విందు పంచేందుకు అజిత్‌, విజయ్‌ మాత్రం సిద్ధమవుతున్నారు. 'ఆరంభం' వంటి అదిరిపోయే హిట్టు తర్వాత అజిత్‌ నటిస్తున్న 'వీరం' జనవరి 13న, 'తలైవా' తర్వాత విజయ్‌ నటిస్తున్న 'జిల్లా' 10న ప్రేక్షకుల చెంతకు రానున్నాయి.

సుదీర్ఘ కాలం తర్వాత వీరిద్దరి చిత్రాలు పోటీగా బరిలోకి దిగనుండటంతో వారి అభిమానుల్లోనే కాకుండా.. సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. 'వీరం' ఆడియోనుఆల్రెడీ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. పొంగల్‌ బరిలో వస్తాయని భావించిన కమల్‌హాసన్‌ 'విశ్వరూపం-2' కూడా వాయిదా లో ఉంది. ఇక కార్తీ 'బిరియాని' ముందే అంటే క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యి వెళ్ళిపోయింది.

English summary
There's gonna be healthy competition between Ajith, Vijay , eagerly waiting to know who wins the Pongal race!! 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu