twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మట్టి పూయించుకున్న నాగచైతన్య హీరోయిన్

    By Srikanya
    |

    నన్ను గంటల తరబడి ఎండలో కూర్చోబెట్టేవారు. ముఖంపై మట్టి కూడా పూసేవారు. అలా చేస్తేనే గానీ పల్లెటూరి పిల్ల గెటప్‌లో కనిపించనని అనేవారు. అందుకే ఆ సినిమాలో అలా కనిపించాను అంటోంది అమలా పౌల్. నాగచైతన్యతో బెజవాడ చిత్రంలో చేసిన అమలా పౌల్ గుర్తుండే ఉంటుంది. ఆమె తన తొలి చిత్రం మైనా కోసం మట్టిపూసుకుని గంటలు తరబడి ఎండలో నిలబడ్డానని చెప్తోంది. దానికి కారణం వివరిస్తూ...'మైనా' (తెలుగులో 'ప్రేమఖైదీ') చేస్తున్నప్పుడు చిత్ర దర్శకుడు నన్ను మేకప్ వాడొద్దని అన్నారు. శరీర ఛాయ కూడా టమోటా రంగులో, బాగా వాడిపోయినట్టు ఉండాలని అన్నారు. అందుకోసమే అలా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి చిత్రాల్లో నేను నేచురల్‌గా ఎలా ఉన్నానో అలాగే కనిపించాను అంది.

    ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు గురించి చెబుతూ..రామ్‌చరణ్‌ సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమే. అయితే చర్చలు ఇంకా సాగుతున్నాయి..ఇంకా ఖరారు కాలేదు అని చెప్పింది అమాలా పౌల్. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రలో ఆమెను తీసుకున్నారు. అలాగే సినిమాలో నటనన్నాక నటీనటులు పాత్రల్లో ఒదిగిపోవాలి. హీరోయిన్ పక్కా పల్లెటూర్లో ఉంటే నేను హీల్స్ వేసుకునే నటిస్తాను అంటే కుదరదు. చెప్పులు లేకుండా నడవాల్సిన సందర్భాల్లో పొలాల గట్లపై అలాగే నడవాలి. అప్పుడే సీన్ పండుతుంది'' అని చెప్పుకొచ్చింది.

    ఇక 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' లో నటించే అవకాశం వస్తే వదులుకోవటానికి కారణం మహేష్‌బాబుకి వదినగా నటించడం ఇష్టం లేకపోవడం వల్ల కాదు అంటోంది. ఈ విషయమై చెప్తూ...నేనూ, దర్శకుడు పరస్పరం చర్చించుకొన్న తరవాతే... ఆ సినిమా నుంచి తప్పుకొన్నాను. అంతేగానీ వదిన పాత్ర నచ్చక కాదు. నేను ఇక్కడకు వచ్చింది నటించడానికే అంది. ఆ తర్వాత ఆమెను అడిగిన పాత్రలో అంజలిని తీసుకున్నారు. మహేష్ సరసన సమంతను ఎంపిక చేసారు.

    అలాగే హీరోయిన్ అంటే అందాల ఆరబోత అనే సిద్ధాంతానికి నేను దూరం..నాలుగు పాటల్లో కనిపించడానికి నేనే అక్కర్లేదు. అందుకు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ రోజుల్లో హీరోయిన్స్ కు నటించే అవకాశం చాలా తక్కువ. అందుకోసం నాయికా ప్రాధాన్యం ఉన్న కథలపైనే ఆధారపడతారు. అవి తరచూ రావు కదా. అందుకే ఏదైనా అవకాశం ఉన్నప్పుడే నటించేయాలి అంది. ఆమె రీసెంట్ గా సిద్దార్ద లవ్ ఫెయిల్యూర్ లో మోడ్రన్ పార్వతిగా కనిపించి అలరించింది.

    English summary
    "I would have got several offers from South,"Amala Paul said. She believes several Telugu producers and directors were after her offering roles. But with the flop show of Bejawada, the situation got reversed and no offers were forthcoming, she says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X