»   » కోర్టు మెట్లు దిగుతూ అమలాపాల్ ఏడ్చేసింది, ఆరు నెలలు గడువు

కోర్టు మెట్లు దిగుతూ అమలాపాల్ ఏడ్చేసింది, ఆరు నెలలు గడువు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ... దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులైంది. వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ శనివారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు

పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ ఇద్దరు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు.

అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే

ఈ విడాకుల పిటిషన్ లో మరో విశేషం ఏమిటీ అంటే...అమలా పాల్ తన భర్త విజయ్ నుండి ఎటువంటి భరణాన్ని కూడా కోరుకోలేదు. కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంటకు కోర్ట్ మరో 6 నెలలు గడువిచ్చింది. ఈ 6 నెలల లోపు వాళ్ళు తమ మధ్య ఉన్న విభేదాలను గనుక తెలుసుకోలేకపోతే కోర్ట్ వాళ్లకు విడాకులు మంజూరు చేస్తుంది.

ఇక కోర్టు నుంచి బయటికొచ్చే సమయంలో అమలాపాల్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిందట. కన్నీళ్లు పెట్టుకుని బాధపడిందట. ఏదేమైనా అమలాపాల్ వైవాహిక జీవితానికి ఇంత తొందరగా తెరపడటం నిజంగా బాధాకరం.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

ఫార్మాలిటీస్ పూర్తచేసి

ఫార్మాలిటీస్ పూర్తచేసి

ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు కోర్టు రిజిస్ట్రిని సంప్రదించాల్సిందిగా వారికి కోర్టు వారు సూచించారు. వీరిద్దరూ డబ్బు లేదా భరణం వంటి డిమాండ్లు ఏమీ చేయలేదు.

అప్పుడు సమ్మతిస్తేనే

అప్పుడు సమ్మతిస్తేనే

కాగా ఆరు నెలల కాలవ్యవధి ముగిసిన తర్వాత వారిద్దరూ సమ్మతిస్తే విడాకులు మంజూరవుతాయి.

రెండేళ్ల క్రితం

రెండేళ్ల క్రితం

రెండేళ్ల క్రితం ద‌ర్శ‌కుడు విజ‌య్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ‌లాపాల్. గ‌త‌కొంత కాలంగా వీరిద్ద‌రూ విడాకులు తీసుకోనున్నారు అని వినిపించింది. తాజాగా వీరిద్ద‌రూ విడాకులు కోరుతూ చైన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు.

నా తప్పేమి లేదు

నా తప్పేమి లేదు


ఈ అంశంపై కొన్ని రోజుల క్రితమే విజయ్ బయటికొచ్చి విడకుల్లో తన తప్పేమీ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

అమలాపాల్ తరుపున

అమలాపాల్ తరుపున

ఆమె తరఫున న్యాయవాది సాయిబ్‌ జోస్‌ కిడానగూర్‌ పిటిషన వేయగా, ఆ సమయంలో అమలాపాల్‌, విజయ్‌ ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు.

సినిమాల్లో నటిస్తూ..

సినిమాల్లో నటిస్తూ..


విజయ్‌ దర్శకత్వం వహించిన సినిమాల్లో అమలాపాల్‌ హీరోయినగా నటించడం, ఇద్దరూ ప్రేమలో పడడం, పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఎంతో ఆర్భాటంగా వీరు పెళ్లి చేసుకోవడం తెలిసిందే.

ఖండించారు

ఖండించారు


కానీ, పెళ్లి తరువాత కూడా అమలాపాల్‌ సినిమాల్లో నటించడం విజయ్‌కి ఇష్టం లేదని, ఆ కారణంతోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కథనాలు వచ్చాయి. విజయ్‌ ఈ వార్తలను ఖండించారు.

ఇంకోవైపు

ఇంకోవైపు

మరోవైపు, అమలాపాల్‌ కూడాఇప్పటికే మూడు సినిమాలకు ఒప్పుకున్నారు. కారణమేదైనా, వీరు విడాకులకు సిద్ధమయ్యారు.

విజయ్ కూడా

విజయ్ కూడా

విజ‌య్ సైతం మ్యూచువ‌ల్ క‌న్సంట్ తో అమ‌ల నుంచి విడిపోవ‌డానికి పిటిష‌న్ వేసిన‌ట్లు స‌మాచారం.

ఇద్దరికీ ఇష్టమే కాబట్టి

ఇద్దరికీ ఇష్టమే కాబట్టి


దీంతో అమ‌ల‌-విజ‌య్ త్వ‌ర‌లోనే విడిపోనున్నారని తేలిపోయింది. కొన్ని నెల‌ల్లోనే ఈ ప్ర‌క్రియ ముగిసిపోవ‌చ్చు.

హీరోయిన్ గా

హీరోయిన్ గా


సింధు స‌మ‌వేలి అనే బి-గ్రేడ్ సినిమాతో హీరోయిన్ గా పాపుల‌ర్ అయింది అమ‌లా. ఆ త‌ర్వాత మైనా సినిమా ఆమెకు ఎన‌లేని పేరు తెచ్చిపెట్టింది. - 12
మీడియాకు నో విడాకుల వార్త‌ల‌పై.. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై ఒక్క మాటా మాట్లాడ‌టానికి ఇష్టపడలేదు అమ‌లాపాల్

తలైవా సమయంలో

తలైవా సమయంలో


నాన్న సినిమా సంద‌ర్భంగానే వీళ్లిద్ద‌రికీ ప‌రిచ‌య‌మైంది. త‌ర్వాత త‌లైవా అనే ఇంకో సినిమా చేశారు. అప్పుడే వాళ్లిద్దరి బంధం బలపడింది.

భర్త స్పందన

భర్త స్పందన

విజయ్‌ స్పందిస్తూ ...తాము విడిపోవడానికి కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు. తామిద్దరం విడిపోతామని కలలో కూడా వూహించలేదంటూనే నమ్మకం, నిజాయితీ లేనప్పుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు.

తెలుగువారికి

తెలుగువారికి


‘బెజవాడ', ‘నాయక్‌', ‘ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితురాలయ్యారు హీరోయిన్ అమలాపాల్‌.

పూర్తి స్వేచ్చ

పూర్తి స్వేచ్చ

తన భర్త విజయ్‌ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా అమలాపాల్ గతంలో పలుమార్లు ప్రస్తావించారు.

అయితే ...

అయితే ...

కొంతకాలంగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వీరిద్దరు విడిపోయారని పలు పత్రికలు కూడా ఇటీవల వార్తలు రాస్తూ పలు కారణాలను ప్రస్తావించాయి.

అప్పడే..

అప్పడే..


2014లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే వీళ్లిద్దరూ విడిపోవడం విచారం కలిగించే విషయం.

కుటుంబంపై నింద

కుటుంబంపై నింద

ముఖ్యంగా విజయ్ కుటుంబం ఈ విషయంతో మీడియాలోనూ, అబిమానులతోనూ విమర్శలు పాలు అవుతోంది. కావాలనే కుటుంబం ఆమెను దూరం పెడుతోందని, ఆమె కెరీర్ ఆశలు అత్త, మామలు చంపేసే ప్రయత్నం చేసారని, వాళ్లని విలన్స్ గా క్రియేట్ చేస్తూ కథనాలు వెలువడుతున్నాయి.

ప్లీజ్ ..వద్దు

ప్లీజ్ ..వద్దు


దయచేసి ఇది మా కుటుంబ విషయం, దాన్ని గౌరవించండి. మా పర్శనల్ స్పేస్ మాకు వదలండి.రూమర్స్ ప్రచారం చేయవద్దు

English summary
Amala Paul, the young actress is officially separating from her husband, AL Vijay. According to the sources close to Amala, the actress do not find the need to address media or clarify things.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu