»   »  అమలాపాల్ కౌంటర్ కు దిమ్మ తిరిగి, సారి చెప్పాడు, నోటి దూల ఉంటే అంతే

అమలాపాల్ కౌంటర్ కు దిమ్మ తిరిగి, సారి చెప్పాడు, నోటి దూల ఉంటే అంతే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారు, సెలబ్రెటీల మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతూంటారు. సెలబ్రెటీలు కూడా చాలా సార్లు దాన్ని రచ్చ చేసి పెద్దది చేసుకోవటం ఎందుకు అన్నట్లుగా చూసి, చూడనట్లు ఉండిపోతారు. అయితే అమలాపాల్ వీరికి విరుద్దం అని ఆమె రీసెంట్ గా ట్విట్టర్ లో ఇచ్చిన కౌంటర్ తో చెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో వివాహ బంధాన్ని తెగ తెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుంచీ అమలాపాల్ మీద చాలా విమర్శలు,కామెంట్స్ వస్తున్నాయి. అత్తామామలకు ఆమె తీరు నచ్చకపోవడంవల్లే ఇదంతా జరిగిందన్నది కొందరి అభిప్రాయంతో కొందరు, మరికొందరు డైవర్స్ తీసుకుందని లోకువగా సోషల్ మీడియాలో ఆమెను ప్రస్దావిస్తూ రాస్తున్నారు.

తాజాగా 'విడాకులు తీసుకున్న మహిళలు ఎప్పుడూ హాట్‌గా, నాటీగా ఉంటారు' అని ఓ ఆకతాయి సోషల్ మీడియాలో అమలా పాల్‌ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ని అమలాపాల్ లైట్‌గా తీసుకోలేదు. ''ఏయ్ అబ్బాయ్.. నీ యాంబిషన్ రాంగ్ డెరైక్షన్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్లీజ్.. మహిళలను గౌరవించడం నేర్చుకో'' అని సదరు ఆకతాయికి కాస్త ఘాటుగానే కౌంటర్ రిప్లై ఇచ్చారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

 మేనమామతో అక్రమం సంభంధం

మేనమామతో అక్రమం సంభంధం

అమలాపాల్ నీలతామరై అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళంలో వికటకవితో ప్రవేశించి వీరశేఖరన్, సింధు సమవేళి చిత్రాల్లో నటించారు. ఇవేవీ పెద్దగా తన కేరీర్‌కు ప్లస్ కాలేదు. అయితే సింధు సమవెళి చిత్రంలో మేనమామతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి పాత్రలో నటించి వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే అది ఆమెకు ఓ రకంగా మంచి ఫ్రీ ప్రచారాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.

ఆ సినిమా లేకపోతే...

ఆ సినిమా లేకపోతే...

ఆ తరువాత ప్రభుసాలమెన్ దర్శకత్వంలో నటించిన మైనా అమలాపాల్‌ను ప్రముఖ హీరోయిన్ల జాబితాలో చేర్చింది. ఆ తరువాత విక్రమ్, విజయ్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాలను అందుకున్నారు. అదే విధంగా తెలుగులోనూ అవకాశాలను అందుకుని బహుభాషా నటిగా గుర్తింపు పొందారు.

మ్యారేజ్ నుంచి డైవర్స్ దాకా

మ్యారేజ్ నుంచి డైవర్స్ దాకా

అలాగే మంచి ఫామ్‌లో ఉండగానే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడి నటనకు విరామం ఇచ్చారు. అప్పటి వరకూ అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి నటనకు పుల్‌స్టాప్ పెట్టనున్నారనే ప్రచారం జరిగింది. అలా విజయ్, అమలాపాల్‌ల దాంపత్య జీవితం ఏడాది పాటు అన్యోన్యంగా సాగింది. ఈ తరువాత మనస్పర్థలు, విడిపోవడాలు జరిగిపోయాయి.

 ఆశలు పెట్టుకున్న సినిమా దెబ్బ కొట్టింది

ఆశలు పెట్టుకున్న సినిమా దెబ్బ కొట్టింది

తాజాగా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. దర్శకుడు విజయ్‌తో కలిసున్నప్పుడు అమలాపాల్‌కు పలు అవకాశాలు తలుపుతట్టాయి. వివాహనంతరం సూర్యకు జంటగా పసంగ-2 చిత్రంలో నటించిన అమలాపాల్ తరువాత అమ్మాకణక్కు చిత్రంలో నటించారు. నటుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రంపై అమలాపాల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే తన నమ్మకాన్ని ఆ చిత్రం పెద్దగా నిలబెట్టలేక పోయింది.

 నిర్మాతలంతా వెనక్కి

నిర్మాతలంతా వెనక్కి


ప్రస్తుతం ధనుష్‌కు జంటగా వడచెన్నై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక్కటే అమలాపాల్ చేతిలో ఉంది. పలువురు దర్శక నిర్మాతలు అమలాపాల్‌ను తమ చిత్రాల్లో హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఎప్పుడైతే విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు గుమ్మం ఎక్కారో అప్పటి నుంచి అమలాపాల్‌ను తమ చిత్రాల్లో ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారని సమాచారం. ఇది నిజంగా అమలాపాల్‌ను షాక్‌కు గురి చేసే విషయమే.

ఆయన ఇన్ఫూలియెన్స్ తో బ్యాన్

ఆయన ఇన్ఫూలియెన్స్ తో బ్యాన్

పరస్పర అంగీకారంతో విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కడం.. ఈ వ్యవహారం మొత్తం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమలాపాల్ పలు చిత్రాల్లో నటించారు. దర్శక-నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం అవకాశాలివ్వడానికి సుముఖంగా లేరట. దానికి కారణం ఏ.ఎల్.విజయ్ తండ్రి అళగప్పన్ అని సమాచారం. ఏ.ఎల్.అళగప్పన్ నటుడు, సీనియర్ నిర్మాత కూడా.

 భయంతోనే వెనక్కి ఆఫర్స్

భయంతోనే వెనక్కి ఆఫర్స్

విజయ్ తండ్రి అలగప్పన్ కు పలువురు తమిళ సినీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో అమలాపాల్‌ను తమ చిత్రంలో హీరోయిన్ గా తీసుకుంటే అళగప్పన్‌తో స్నేహానికి ఎక్కడ ఫుల్‌స్టాప్ పడుతుందో? అనే భయంతో కొందరు నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారట.

 అమలాపాల్ ని ప్రక్కన పెడుతున్నారు

అమలాపాల్ ని ప్రక్కన పెడుతున్నారు

ఈ రూమర్స్ కు బలం చేకూరుస్తూ.. విడాకులకు ముందు అమలాపాల్‌ని సంప్రదించిన కొందరు నిర్మాతలు ఇప్పుడా సినిమాల ఊసే ఎత్తడంలేదట. అళగప్పన్ సూచనల ప్రకారమే అమలాపాల్‌ని పక్కన పెడుతున్నారట. దాంతో ఇప్పుడు అమలాపాల్ పరిస్దితి డైలామోలో పడింది.

 ధనుష్ దగ్గరుండే ఆఫర్

ధనుష్ దగ్గరుండే ఆఫర్

కాన, ఈ బ్యూటీకి సూపర్ ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసనే ఛాన్స్ వచ్చిందట. పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఆయన అల్లుడు ధనుష్ నిర్మించనున్న సినిమాలో అమలా పాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ధనుష్, అమలాపాల్ మంచి స్నేహితులనీ.. అందుకే, మామగారికి జోడీగా చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారనీ కోడంబాక్కమ్ వర్గాల సమాచారం.

ధనుష్ తో అనుబంధమే

ధనుష్ తో అనుబంధమే

ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన 'వీఐపీ'లో ఆయన సరసన, ధనుష్ నిర్మించిన 'అమ్మా కనక్కు' సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహ రిస్తున్న 'వడ చెన్నై'లోనూ అమలాపాలే హీరోయిన్. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో కానీ అమలాపాల్ కు ధనుష్ తో రిలేషన్ పెడుతూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవి ఎంతదాకా వెళ్లాయంటే ధనుషే..వీరి విడాకులకు కారణమనేదాకా.

 సత్యారాజ్ సరసన కూడా

సత్యారాజ్ సరసన కూడా

అమలా పాల్‌ ఓ ప్రక్కన 33 ఏళ్ల ధనుష్ సరసన నటిస్తూనే, 61 ఏళ్ల సత్యరాజ్ పక్కన నటించడానికి సంతకం చేసేశారు.
మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా 'లైలా ఓ లైలా'ను సత్యరాజ్ హీరోగా తమిళంలో 'మురుగవేల్'గా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో పోషించిన పాత్రనే మళ్లీ తమిళంలో చేస్తున్నారు

 వడ చెన్నై నుంచి కూడా అవుట్

వడ చెన్నై నుంచి కూడా అవుట్

ఇదిలా ఉండగా వీరి విడాకులకు కారణం ధనుష్‌తో తీయబోవు మూవీనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ధనుష్‌ సినిమా చేయోద్దని విజయ్‌ చెప్పడం, అది లెక్కచేయకుండా సినిమాకు సైన్ చేయడంతో అప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. కట్‌ చేస్తే ధనుష్‌ మూవీలో నటించే ఛాన్స్ ఈ అమ్మడికి ఇవ్వకూడదని యూనిట్‌ డిసైడ్‌ అయినట్టు కోలీవుడ్‌ టాక్ .

 ధనుష్ భార్య అమలాపాల్ కు అడ్డుగా

ధనుష్ భార్య అమలాపాల్ కు అడ్డుగా

ధనుష్‌ భార్య ఐశ్వర్య.. అమలాపాల్‌తో సినిమా చేయోద్దని గట్టిగా చెబుతోందట. దాంతో అమలా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని పలువురి కామెంట్స్ . మరో వైపు అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన...ఐశ్వర్యపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 చులకన అవటం ఎందుకని

చులకన అవటం ఎందుకని

మార్చి నుండి విడి విడిగా ఉంటున్న ఈ జంట ఎట్టకేలకు విడాకులు తీసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు . అయితే విడాకుల సమయంలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుని చులకన అయ్యే బదులు కాం గా విడిపోతే బెటర్ అనే నిర్ణయానికొచ్చారట. అందుకే ఇద్దరూ కలిసి కోర్టు కెళ్ళారు . వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ ఇద్దరికీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయనుంది.

 అమలాకు డబ్బు వద్దట

అమలాకు డబ్బు వద్దట

ఇక అమలా పాల్ పెట్టుకున్న పిటిషన్ లో తన భర్త విజయ్ నుండి ఎటువంటి భరణాన్ని కూడా కోరుకపోవడం గమనర్హం. మరో ప్రక్క పెళ్లి అయిన తరువాత హీరోయిన్‌గా రాణించడం సాధారణ విషయం కాదు. అలాంటి హీరోయిన్లకు ఫాలోయింగ్ ఉండదని పరిశ్రమ పక్కన పెట్టేస్తుందనే ప్రచారం ఉంది. అలాంటిది అమలాపాల్ దాన్ని అధిగమిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

English summary
Amala Paul gave a counter at twitter with Retweeted "Hey Boy...Looks like your ambitions are in the wrong direction. Pls learn to respect women !!!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu