»   » హీరోయిన్స్ కు ప్రాధాన్యమేదీ?: అమలా పాల్

హీరోయిన్స్ కు ప్రాధాన్యమేదీ?: అమలా పాల్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : అగ్రనటుల సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తోంది నటి అమలాపాల్‌. తమిళంతో పాటు తెలుగులోనూ హవా చాటుకుంటోందీ సుందరి. 'తలైవా'(అన్న) తో మళ్లీ తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఆమె ముచ్చటిస్తూ.. మలేషియాలో 'దైవతిరుమగల్‌' చిత్రీకరణ జరుగుతున్నప్పుడు దర్శకుడు విజయ్‌ కొత్త సినిమా కథ చెప్పారు. డ్యాన్స్‌పై ఆసక్తి ఉన్న అమ్మాయిగా, పోలీసు అధికారిణిగా కనిపించాల్సి ఉందన్నారు.

  చాలారోజుల తర్వాతే ఇందులో విజయ్‌ నటిస్తున్నారని, అదే 'తలైవా' అని చెప్పారు. ఎంతో ఆశ్చర్యమేసింది. ఆయన అడిగిన సమయంలో నా వద్ద కాల్షీట్లు లేవు. సినిమా తెరకెక్కేందుకు కాస్త ఆలస్యమైనందున అదృష్టం కొద్దీ 'తలైవా'తో జోడీకట్టాను. వాస్తవానికి పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ బొమ్మలా వచ్చి వెళ్లాల్సిందే. అయితే 'తలైవా'లో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. చిత్రీకరణ సమయంలో నటుడు విజయ్‌ చాలా మంచి విషయాలు నేర్పారు. విజయ్‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.


  అలాగే విజయ్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది అమలాపాల్. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో క్రేజీ హీరోయిన్‌గా ప్రకాశిస్తోంది. కోలీవుడ్‌లో విజయ్‌తో జతకట్టిన తలైవా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జయంరవికి జంటగా నిమిర్న్‌ందు నిల్ చిత్రంలో, ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో, మలయాళంలో ఒక్కో చిత్రంలో చేస్తోంది. అమలాపాల్ మాట్లాడుతూ విజయ్ సరసన నటించాలన్న కోరిక తలైవా చిత్రంతో నెరవేరిందని తెలిపింది.

  అన్న చిత్రంలో హీరోయిన్‌గా దర్శకుడు విజయ్ తనను ఎంపిక చేసినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనంది. తన జీవితంలో ఊహించని సంఘటనలు చాలా జరిగాయని పేర్కొంది. తాను స్నేహానికి చాలా విలువనిస్తానని తెలిపింది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లకు ప్రాముఖ్యం ఉండదని పేర్కొంది. అయితే తలైవాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని వివరించింది. ఈ పాత్రలో నటించడం చాలెంజింగ్‌గా ఉందని పేర్కొంది. ఈ పాత్ర పోషణలో హీరో విజయ్ తనకు చాలా సహకరించారని చెప్పింది. వృత్తి పట్ల అంకితభావం గల వ్యక్తి విజయ్ అని పొడగ్తలు కురిపించింది.

  English summary
  
 Amala paul says that she is happy with Thalaivaa result. Where Nayakan was a hero-versus-the-Establishment saga, epic in scope, Thalaivaa, for the most part, confines itself to a hero-versus-villain template. And this makes it palatable to today’s “Dei, thatha” audience, who seem to squirm at the slightest sign of ambition. Could the film have been shorter? Sure. But let’s be grateful that that’s the only major complaint. At least, we’re not left with a don dancing in the Alps. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more