»   » మాజీ భర్తకు మళ్లీ పెళ్లి? ఆవేదనతో డిస్ట్రబ్ అయ్యి, షూటింగ్ కు బ్రేక్

మాజీ భర్తకు మళ్లీ పెళ్లి? ఆవేదనతో డిస్ట్రబ్ అయ్యి, షూటింగ్ కు బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కొద్ది రోజుల క్రితం ..నటి అమలా పాల్‌, ఏ.ఎల్‌. విజయ్‌లు అధికారికంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్లు బ్రతుకుతున్నారు. అయితే విజయ్‌ ఇప్పుడు రెండో వివాహం చేసుకోనున్నట్లు తమిళ వర్గాల సమాచారం. దాంతో ఈ విషయమై అమలాపాల్ డిస్ట్రబ్ అయ్యిందని వార్తలువస్తున్నాయి.

దర్శకుడు విజయ్‌, హీరోయిన్ అమల పాల్ ప్రేమించి పెళ్లిచేసుకున్న కొద్ది రోజులుకే స్పర్దలు వచ్చి విడిపోయారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా ఈసారి తండ్రి అళగప్పన్‌ విజయ్‌కి మంచి సంబంధం చూస్తున్నారట. ఈ విషయం షూటింగ్ లో బిజీగా ఉన్న అమలకు తెలీడంతో తీవ్ర ఉద్వేగానికి లోనైందట. ప్రశాంతంగా షూటింగ్‌లో పాల్గొనలేక డిస్ట్రబ్‌ అయినట్లు తెలుస్తోంది. దాంతో షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Amala Paul’s ex-husband AL Vijay to remarry?

అమల, విజయ్‌విడిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించినప్పుడు ఇప్పటికీ విజయ్‌ అంటేఇష్టమేనని అమల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 2011లో దైవ తిరుమగళ్‌ (నాన్న) చిత్ర సెట్స్‌లో అమల, విజయ్‌ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2014 జూన్‌లో వివాహం చేసుకున్నారు. 2016లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

కొంతకాలం జ్యూడీషియల్‌ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వారికి విడాకులు మంజూరయ్యాయి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటి వారి నిబంధనను అమల పాటించకపోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ జంట వివాహమైన కొంత కాలానికే విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించింది. దీంతో వారిద్ద‌రికి చ‌ట్ట‌బ‌ద్దంగా విడాకులు ల‌భించాయి.

పెళ్లి తర్వాత కూడా నటించాలని అమలాపాల్‌ కోరడంతో సంతోషంగా సరేనన్నానని పేర్కొన్నారు. కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్నందువల్లే తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ సత్యదూరమేనన్నారు. తామిద్దరం విడిపోతామని తాను కలలో కూడా వూహించలేదని, కానీ నమ్మకం, నిజాయితీ లేనప్పుడు కూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు. అందువల్లే తీవ్రమైన ఆవేదనతో విడిపోతున్నానని, వాస్తవాలు తెలియకుండా కొన్ని పత్రికలు రాసిన వార్తలతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యా'నని చెప్పారు.

English summary
Al Vijay is looking to get married again and this time, his father A l Alagappan has taken on the responsibility of finding him, his life partner. when the news reached Amala, it apparently upset her, so much so that she found it difficult to continue shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu