అమలాపాల్‌ అరెస్ట్ తప్పదా? బెంజ్ తెచ్చిన ముప్పు.. బిగిస్తున్న ఉచ్చు..

By Rajababu

పాండిచ్చేరిలో పన్ను ఎగవేత కేసు అందాల తార అమలాపాల్ మెడకు గట్టిగానే బిగుసుకొంటున్నది. వాహన రిజిస్ట్రేషన్ విషయంలో పన్ను తప్పించుకొనేందుకు నకిలీ పత్రాలను సమర్పించి ఫోర్జరీకి పాల్పడినట్టు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అమలాపాల్‌కు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో అమలాపాల్ కేరళ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.

Recommended Video

Amala Paul Speach On 'Dongodocchadu'Audio Launch మొదటి సారి చేస్తున్నా

 తారల పన్నుఎగవేత ఇలా..

తారల పన్నుఎగవేత ఇలా..

రూ.20 లక్షలకుపైగా ధర పలికే విలాసవంతమైన కార్లపై 20 శాతం పన్ను తప్పించుకోవడానికి పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో నివాసం ఉంటున్నట్టు అమలాపాల్ తప్పుడు పత్రాలు సృష్టించారు. వాస్తవానికి కేరళ నివాసి అయిన అమలాపాల్ కేరళలో కార్లను కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేశారు.

 బెంజ్ కారు తెచ్చిన ముప్పు

బెంజ్ కారు తెచ్చిన ముప్పు

మీడియా కథనాల ప్రకారం ప్రకారం.. అందాల తార అమలపాల్ రూ. 1.75 లక్షలు చెల్లించి ఎస్ క్లాస్ బెంజ్ కారును లోన్‌పై తీసుకొన్నారు. అయితే పాండిచ్చేరిలో ఉమేశ్ పేరిట ఉన్న ఓ ఇంటిలో కిరాయికి ఉంటున్నట్టు చూపే పత్రాలను ఆమె సమర్పించారు. ఇదే అడ్రస్ నుంచి చాలా మంది ప్రముఖులు కార్లను రిజిస్టర్ చేసుకొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

ముందస్తు బెయిల్‌కు అమలాపాల్

ముందస్తు బెయిల్‌కు అమలాపాల్

అయితే ఈ కేసులో అమలాపాల్‌‌కు క్రైం బ్రాంచ్ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. పన్ను ఎగవేత కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమలాపాల్ అరెస్ట్ తప్పదు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె అప్రమత్తమయ్యారు. అరెస్ట్‌ను నివారించేందుకు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిసింది.

 ఆరోపణలన్నీ అవాస్తవం

ఆరోపణలన్నీ అవాస్తవం

కారు రిజిస్ట్రేషన్‌పై పన్ను తప్పించుకొనేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించానని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. పాండిచ్చేరిలో రూ.5500 చెల్లించి ఓ ఇంటిని దాదాపు 11 నెలలపాటు అద్దెకు తీసుకొన్నాను అని ఇటీవల అమలాపాల్ సమాధానం ఇచ్చారు.

కేసులో మలయాళ సూపర్‌స్టార్లు

కేసులో మలయాళ సూపర్‌స్టార్లు

వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో పన్ను ఎగవేతకు పాల్పడిన పలువురు నటులు, దర్శకులు ఉన్నారు. ఈ వ్యవహారంలో మలయాళ నటుడు ఫహద్ పాజిల్, రాజ్యసభ ఎంపీ సురేష్ గోపి కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరికి కూడా నోటీసులు జారీ కాగా.. వారు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకొన్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X