త్రిష కు అరెస్ట్ వారెంట్

By Srikanya

Trisha
చెన్నై: అసలే అవకాశాలు లేక ఆందోళనతో ఉన్న త్రిషకు మరో సమస్య ఎదురైంది. ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్ట్ మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసారు. గతంలో త్రిష ఫైల్ చేసిన కేసే ఇప్పుడు ఆమె తలకు చుట్టుకుంది. కేసు వేసి కోర్టుకు హాజర కాకపోవటంతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లు భావించి అరెస్టు వారెంట్ జారీ చేసారు.

వివరాల్లోకి వెళితే.. 2004 లో ఓ మ్యాగజైన్ ప్రచురించిన తన ఫోటోలకు సంభందించి సదరు మ్యాగజైన్ పై త్రిష అప్పట్లో కేసు వేసారు. ఆ ఫోటోలు మార్ఫింగ్ వి అని ఆమె వాదన. ఆ వివాదం అప్పట్లో మీడియాలో దుమారం రేపింది. ఆ పత్రిక ఖండన కూడా చేసింది. అయితే ఆ కేసు మాత్రం కోర్టులో నలుగుతూనే ఉంది.

ఈ లోగా ఈ కేసు వాదనలకు సంభందించి త్రిష,ఆమె తల్లి ఉమ కృష్ణన్ కోర్టులో ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దాంతో వీరిద్దరి మీద చెన్నై ఎగ్మోర్ కోర్టుకి చెందిన మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. దీని నిమిత్తం తల్లీ కూతుళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక తెలుగు, తమిళ సినిమాల్లో త్రిషను చూసి చాలాకాలమైంది. 'దమ్ము' తరవాత త్రిష తెలుగు తెరపై కనిపించలేదు. 'రమ్‌' అనే సినిమా మొదలైనా దాని జాడ లేదు. క్రమంగా త్రిష తెలుగు సినిమాలకి దూరమవుతోందా..?అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అయితే మరోవైపు తనకు వచ్చిన అవకాశాలు చేసుకొంటూ 'నేనూ పరిశ్రమలో ఉన్నా..' అనిపించుకొంటోంది. తాజాగా ఓ కన్నడ చిత్రంలో నటించడానికి ఒప్పుకొంది.

పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరో. 'దూకుడు' సినిమాకి ఇది రీమేక్‌. అడుగుపెట్టిందో లేదో కన్నడ ప్రేక్షకుల్ని, అక్కడి పరిశ్రమనీ మచ్చిక చేసుకొనే పనిలో పడింది. ''కన్నడ పరిశ్రమ నాకిస్తున్న గౌరవం పట్ల సంతోషంగా ఉన్నా. ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలని వుంది. 'దూకుడు' సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. కానీ అదే సినిమా రీమేక్‌లో నటిస్తా అని అనుకోలేదు'' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X