»   » విడుదల కాకపోతే వీధిలోకే... : 'అన్న' నిర్మాత

విడుదల కాకపోతే వీధిలోకే... : 'అన్న' నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'తలైవా' (అన్న) చిత్రం విడుదల కాకపోతే అప్పులపాలై వీధిలోకి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిర్మాత చంద్రప్రకాశ్‌జైన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జయలలితకు గురువారం ఓ లేఖను పంపించారు. 'తలైవా' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాను. గత 9వతేదీన విడుదల చేయాలని అనుకున్నా. కొన్ని కారణాల వల్ల తమిళనాడులో విడుదల కాలేదు. కానీ అదేరోజున కర్ణాటక, కేరళ, ఆంధ్రలో విడుదలైంది. ఇదిలా ఉండగా ఇంటర్నెట్‌లో ఈ సినిమాను విడుదల చేశారని దీనివల్ల కోట్లాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది.

16వతేదీ కల్లా విడుదల కాకపోతే.. తీసుకున్న అప్పులు చెల్లించలేక వీధిపాలైపోతా. చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అందువల్ల సినిమాను శుక్రవారం విడుదల చేసేందుకు సహకరించాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ విషయమై మధ్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో చంద్రప్రకాశ్‌, దర్శకుడు విజయ్‌ పాల్గొన్నారు. జయలలితకు పంపిన లేఖ గురించి ప్రస్తావించారు.

సినిమా విడుదల కోసం చిత్ర యూనిట్‌, విజయ్‌ తండ్రి సకల చర్యలు తీసుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బాంబు బెదిరింపులకు తగిన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో తెరపైకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 'తలైవా త్వరలోనే విడుదలవుతుంది. అందరికీ నచ్చే అంశాలు ఇందులో మెండుగా ఉన్నాయి. అభిమానులకు, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని' విజయ్‌ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అనుకున్న సమయానికి సినిమా తెరపైకి రాకపోతే నిర్మాత ఎంత కంగారుపడిపోతాడో చెప్పనవసరంలేదు. ఇక యూనిట్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ప్రేక్షకులైతే వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి అంచనాలతోనే కమల్‌ 'విశ్వరూపం' హాలీవుడ్‌ స్థాయిలో విడుదలకు ముస్తాబైంది. కొన్నివర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో హిందీ, తెలుగు భాషల్లో విడుదలైంది. కొన్నిచోట్ల తమిళంలోనూ తెరపైకి వచ్చింది. తమిళనాట మాత్రం విడుదలకు నోచుకోలేదు.

విడుదలకు ముందే విశ్వరూపం' పైరేటెడ్‌ సీడీలు మార్కెట్లోకి వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చింది. అప్పటికే చాలామంది సినిమాను ఇంట్లో చూసేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే 'తలైవా'కు తలెత్తింది. ప్రస్తుతం ఈ సినిమా పైరసీ డీవీడీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. 'విశ్వరూపం' చిత్రానికి బలమైన కథ ఉండటంతో ప్రేక్షకులను థియేటర్‌ వరకు రప్పించింది. ఇప్పుడు విజయ్‌ నటించిన 'తలైవా'కు ప్రధాన సవాల్‌ ఇదే.

English summary
Vijay-starrer Tamil action-drama "Thalaivaa" released worldwide, except in Tamil Nadu and Puducherry, last week. Now producer Chandra Prakash Jain has requested the intervention of Tamil Nadu Chief Minister J. Jayalalitha to help the film's release in these two places. "We have sought an appointment with the chief minister of the state. We are waiting to meet her and discuss the issue in detail. I have already incurred huge loss due to the delay. A further delayed means heavy losses," Jain said in a statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu