»   » మళ్లీ అనుష్కనే ..అయితే భార్య గా

మళ్లీ అనుష్కనే ..అయితే భార్య గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఒక సారి ఓ కాంబినేషన్ హిట్ అయ్యిందంటే దర్శక,నిర్మాతలు దాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం సూర్య, అనుష్క కాంబినేషన్ కూడా అలాగే రిపీట్ కానుంది. మొదట వద్దనుకున్నా చివరకి అనుష్క లేకుండా చేయటం వృధా అనే నిర్ణయానికి వచ్చి ఆమెని ప్రాజెక్టులోకి తీసుకు వచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యతో సూపర్ హిట్ ఇచ్చిన దర్సకుడు హరి. ఆయన దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘సింగం 3'కి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.

Anushka again with Surya in Singam-3

ఇందులో సూర్యకు భార్యగా అనుష్క పాత్ర కొనసాగుతోంది. మరోవైపు ఇందులో సీఐడీ పోలీసు అధికారిగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. గత రెండు భాగాల్లోనూ శ్రుతి లేదు. తొలి రెండు భాగాలకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. కానీ మూడో భాగానికి హ్యారీస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలోని రాయపురం హార్బర్‌లో తొలి షెడ్యూల్‌ ఆరంభమవుతుంది. ఈ సన్నివేశాలు వారం రోజుల కిందటే ప్రారంభం కావాల్సింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. వారం రోజుల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత విశాఖపట్నంలో జరుగనున్నట్లు సమాచారం.

Anushka again with Surya in Singam-3

సూర్య నటించిన ‘పసంగ 2' కూడా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు ఆయన విక్రంకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘24' సినిమా కూడా చివరిదశకు చేరుకుంది. దీంతో ‘సింగం 3'పై దృష్టిపెడుతున్నారు సూర్య.

English summary
Anushka will again pair with Tamil Hero Surya in Singam-3 directed by Director Hari.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu