»   » అనుష్క ఫ్యాన్స్ నిరాశ..క్యారక్టర్ మార్చమని డైరక్టర్ ని

అనుష్క ఫ్యాన్స్ నిరాశ..క్యారక్టర్ మార్చమని డైరక్టర్ ని

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఎస్-3. ఈ చిత్రంలో గతంలో ‘సింగం', ‘సింగం-2' లో నటించిన అనుష్కను తీసుకున్నారని, కాకపోతే ఇందులో సూర్యకి భార్యగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. భార్యగా అనుష్క కనిపిస్తే ఎలా రొమాంటిక్ ఏంగిల్ ఏముంటుందనేది అనుష్క అభిమానుల ప్రశ్న. దానికి తోడు ఈ సినిమాలో శృతిహాసన్ ని మరో హీరోయిన్ గా తీసుకుంటున్నారనే వార్త కూడా వారిని డైలమాలో పడేస్తోంది.

ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి,సైజ్ జీరోలతో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న అనుష్క...ఇలా మళ్లీ వెనక్కి వెళ్లినట్లుగా హీరోకి భార్యగా నటించటం తమకు ఏ మాత్రం ఇష్టం సోషల్ నెట్ వర్కింగ్ సాక్షిగా అనుష్క ఫ్యాన్స్..డైరక్టర్ హరిని, క్యారక్టర్ మార్చమని డిమాండ్ చేస్తున్నట్లు వార్త. మరో ప్రక్క జనవరి 12 నుంచి అనుష్క షూటింగ్ లో పాల్గొననుందని స్టూడియో గ్రీన్ సంస్ధ తెలియచేసింది.

 Anushka pairing up with Surya as his wife

బుధవారం అర్ధరాత్రి ఈ చిత్రానికి సంబంధించిన న్యూ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అవి సూర్య అభిమానులకు పండుగ గిఫ్ట్స్ లా అనిపించాయట.సూర్య సొంత బేనర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను గత నెలలోనే ప్రారంబించాల్సి ఉండగా తమిళనాడులో కురిసిన వర్షాల కారణంగా సినిమా నిర్మాణాన్ని వాయిదా వేశారు.

ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ్‌ థ్రిల్లర్‌ ‘24' త్వరలో విడుదల కానుంది. 24 చిత్రం నిర్మాణం పూర్తి కాబోతోందని తర్వాత ఎస్-3పై దృష్టి పెడతానని సూర్య మీడియాకి వెల్లడించారు. ఈ చిత్రానికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా సమంత, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

సూర్యకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పలకరించాయి... 'సికిందర్, రాక్షసుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు కావడంతో సూర్య ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు... ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిలోనే సూర్యకు 'సింగం' చిత్రాలతో విజయాలను అందించాడు దర్శకుడు హరి... అదే తీరున సాగుతున్న సూర్యకు 'ఎస్-3' కూడా విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

English summary
Featuring Surya in the lead, sequel of Singham, titled "S3" film has Anushka pairing up with him as his wife, while Shruti Haasan will be seen as another heroine
Please Wait while comments are loading...